HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు రిమాండ్‌

HMDA Bala Krishna: అక్రమ ఆస్తుల కేసులో అరెస్టైన HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు నాంపల్లి కోర్టు రిమాండ్‌ విధించింది.

Update: 2024-01-25 13:09 GMT

HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు రిమాండ్‌

HMDA Bala Krishna: అక్రమ ఆస్తుల కేసులో అరెస్టైన HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు నాంపల్లి కోర్టు రిమాండ్‌ విధించింది. 14 రోజుల పాటు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఫిబ్రవరి 8 వరకు శివ బాలకృష్ణ రిమాండ్‌లో ఉండనున్నారు. ప్రస్తుతం శివబాలకృష్ణను అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ ఇళ్లు, ఆఫీసులపై దాడులు నిర్వహించారు. ఏకకాలంలో 17 చోట్ల సోదాలు జరిపారు. అయితే ఏసీబీ దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏసీబీ సోదాల్లో 100 కోట్ల అక్రమ ఆస్తులను అధికారులు గుర్తించారు. 200 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అనుమానిస్తోంది.

హైదరాబాద్‌లో విల్లాలు, ప్లాట్లతో పాటు.. భారీగా భూములను ఏసీబీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ చుట్టుపక్కల 100 ఎకరాల భూపత్రాలను అధికారులు సీజ్ చేశారు. 80కి పైగా ఖరీదైన వాచీలు, 18 ఐ ఫోన్లు, కల్వకుర్తిలో 26 ఎకరాలు, జనగామలో 24 ఎకరాలు, యాదాద్రిలో 23, కొడకండ్లలో 17 ఎకరాల పత్రాలను అధికారులు సీజ్ చేశారు. శివబాలకృష్ణ హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు భారీ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Tags:    

Similar News