ఈ వింత చేప ఎంత బాగుందో

Fishermen Caught Strange Fish : సాధారణంగా మనం చాలా రకాల చేపలను చూసే ఉంటాం. ఆ చేపలు ఏ జాతికి చెందినవి, వాటి గురించి పూర్తి వివరాలను మత్సకారులు చెపుతుంటారు.

Update: 2020-08-16 06:49 GMT
Strange Fish In peddapalli

Fishermen Caught Strange Fish : సాధారణంగా మనం చాలా రకాల చేపలను చూసే ఉంటాం. ఆ చేపలు ఏ జాతికి చెందినవి, వాటి గురించి పూర్తి వివరాలను మత్సకారులు చెపుతుంటారు. కానీ ఓ చేపను చూసిన మత్సకారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అది ఏ జాతికి చెందిన చేపో కూడా చెప్పలేకపోతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో గత మూడు నాలుగు రోజులుగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని వాగులూ వంకలూ, చెరువులు, కుంటలు, నదులు పొంగి పొరలుతున్నాయి. అదే విధంగా పెద్దపెల్లి జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు కూడా నిండుకుండను తలపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలం దూలికట్టలో జాలర్లు ప్రతి రోజులాగే వారి కుల వృత్తిలో భాగంగా చెరువుల్లో చేపల వేటకు వెళ్లారు. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు చేపలు పడతాయో లేదో అనే అనుమానంతో ఆ దేవునిపై భారం వేసి వలలు విసిరారు. అలా వేసిన కొద్దిసేపటికే అదృష్టవశాత్తుల కొన్ని చేపలు వలలో చిక్కుకున్నాయి. హమ్మయ్య ఎన్నో కొన్ని చేపలు తమకు చిక్కాయి అని బయటికి తీసి చూడగా వాటిలో ఓ చేప వింతగా కనిపించింది. గోల్డెన్ రంగులో ఉన్న ఆ చేప ఒక్కసారిగా అక్కడ ఉన్న వారిని ఆకర్షించింది.

అయితే ఈ చేపను చూసిన జాలర్లు ఈ చేప వింతగా ఉందని ఇప్పటి వరకు ఇలాంటి చేపను మేము చూడలేదని అంటున్నారు. ఇది ఏ జాతికి చెందిన చేపో కూడా తమకు తెలియదంటున్నారు. బంగారు వర్ణంలో ఉన్న ఈ వింత చేపను ప్రజలు చూసేందుకు వస్తున్నారు. చూసిన వారెవరూ కూడా ఈ చేపను ఏ జాతి చేపో చెప్పలేకపోతున్నారు. నిజానికి ఇలాంటి చేపలు చిన్నాగా ఉన్నప్పుడు చాలా మంది ఎక్వేరియంలో పెంచుకుంటారు. ఆ చేపలను మనం గోల్డ్ ఫిష్ లు అంటాం. ఇప్పుడు మత్సకారులకు దొరికిన చేప కూడా ఇలాగే ఉంది కానీ సైజులో చాలా పెద్దగా ఉంది. అందుకే ఇది అందర్నీ ఆకర్షిస్తోంది. కాగా మత్సకారులు అసలు ఈ చేప ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందో తెలుసుకోలేకపోతున్నారు. ఇక గత రెండేళ్లుగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి అరుదైన, కొత్త కొత్త చేపలు ఈ మధ్య బాగా కనిపిస్తున్నాయి. అరుదైన చేపలు లభించడం మంచి విషయమే.

 




Tags:    

Similar News