Telangana: ఫస్డ్ డోస్ వ్యాక్సినేషన్‌కు బ్రేక్
Telangana:తెలంగాణలో రేపటి నుంచి మొదటి డోస్ వ్యాక్సిన్ తాత్కాలికంగా నిలిపివేసింది ఆరోగ్య శాఖ.
Telangana: తెలంగాణలో రేపటి నుంచి మొదటి డోస్ వ్యాక్సిన్ తాత్కాలికంగా నిలిపివేసింది ఆరోగ్య శాఖ. రాష్ట్రానికి అవసరానికి తగ్గ మోతాదులో వ్యాక్సిన్లు రాని కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొదటి డోస్‌కు బ్రేక్ ఇచ్చి రెండో డోస్ కంప్లీట్ చేయదలచింది. ఈ నేపథ్యంలో మే 15 వరకు ఫస్డ్ డోస్ వ్యాక్సినేషన్ నిలిచిపోనుంది. రేపటినుంచి రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. రెండవ డోస్ తీసుకునే వారు 11 లక్షల మంది ఉన్నారు.