తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. 30,453 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి

Telangana Government Jobs: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది.

Update: 2022-03-23 15:37 GMT

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. 30,453 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి

Telangana Government Jobs: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 30 వేల 453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది. గ్రూప్‌-1లో 503 పోస్టుల భర్తీకి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్‌పీఎస్సీ తదుపరి ప్రక్రియను కొనసాగించనుంది. పోలీసు నియామక సంస్థ ద్వారా జైళ్లశాఖలో 154 పోస్టులు, పోలీసు శాఖలో 16,587 పోస్టులు భర్తీ చేయనున్నారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా జైళ్లశాఖలో 31 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు, వైద్యారోగ్యశాఖలో 2,662 పోస్టులు, డిప్యూటీ కలెక్టర్‌- 42, డీఎస్పీలు-91, ఎంపీడీవో-121, వైద్యారోగ్యశాఖ పాలనాధికారి -20, వాణిజ్య పన్నులశాఖలో 48, అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ -38, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌-40 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటితో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఆర్థికశాఖ విడుదల చేసింది. ఇందుకు అనుగుణంగా టెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు.

Tags:    

Similar News