MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు తుది తీర్పు
MLC Kavitha: రెగ్యులర్ బెయిల్ కావాలని కోర్టును ఆశ్రయించిన కవిత
MLC Kavitha: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు తుది తీర్పు వెలువడనుంది. మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు కవితకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆ తర్వాత విచారణలో భాగంగా.. ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో తనకు రెగ్యులర్ బెయిల్ కావాలని.. కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. అంతకుముందు మధ్యంతర బెయిల్‌ను కోర్టు తిరస్కరించింది.