Cyberabad Police: న్యూ ఇయర్ వేళ భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

Cyberabad Police: రాచకొండ పరిధిలో 517 డ్రంక్ అండ్‌ డ్రైవ్ కేసులు నమోదు

Update: 2024-01-01 07:45 GMT

Cyberabad Police: న్యూ ఇయర్ వేళ భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

Cyberabad Police: న్యూఇయర్ వేళ భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ చెకింగ్స్ నిర్వహించారు. పబ్స్‌లో స్నిఫర్ డాగ్స్, మఫ్టీలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు.రాత్రి 11 గంటల వరకు 34 కేసులు నమోదయ్యాయి. 59 ట్రాఫిక్ పీఎస్‌లలో 260 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. పోలీసులు..నలుగురు డ్రగ్స్ ప్లేయర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సైబరాబాద్‌లో 1241 కేసులు నమోదు కాగా.. అందులో ద్విచక్ర వాహనాలపై 938 కేసులు, త్రి వీలర్‌లపై 21 కేసులు, మద్యం తాగి కారు నడుపుతున్న 275 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. హెవీ వెహికల్స్‌ అయిన 7 వాహనాలపై కూడా కేసులు నమోదయ్యాయి. రాచకొండలో 517 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా.. ద్విచక్ర వాహనాలు 431 వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఇక మద్యం తాగి కారు నడిపిన 76 మందిపై డీడీ కేసులు నమోదు చేశారు.

Tags:    

Similar News