Telangana Crop Loan Waiver : రుణమాఫీ కాలేదా? అయితే ఇక్కడ దరఖాస్తు ఇవ్వండి.. పూర్తి వివరాలివే
Loan Waiver Issues: తెలంగాణలో మూడు విడదల్లో రైతు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కొంతమంది రైతులు ఆనందిస్తుంటే.. మరికొంత మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు సాంకేతి సమస్యలు, ఇతర కారణాలతో రైతు రుణమాఫీ కానీ రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
Crop loan waiver technical issues : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని మూడు దశల్లో చేపట్టింది. ఆగస్టు 15వ తేదీ వరకు మూడు దఫాలుగా రుణమాఫీ చేసింది. రూ. 2లక్షల వరకు రుణం తీసుకున్న రైతులందరికీ విడతలవారీగా మాఫీ చేసింది. అయితే కొంతమంది రైతులు రుణమాఫీ అయిందని సంతోషం వ్యక్తం చేస్తుండగా..ఇంకొంతమంది అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తమకు రుణం మాఫీ అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నా మాఫీ కాలేదంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తమ వేదనను అధికారులు చెబుతున్నారు. తమకు రుణం ఎందుకు మాఫీ కాలేదంటూ అడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ అందించేందుకు భరోసా ఇచ్చేలా కార్యాచరణకు సిద్ధమవుతున్నవారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి
రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లోని వ్యవసాయ శాఖాధికారుల కార్యాలయాల్లో ఏవోలు అన్నదాతలకు అందుబాటులో ఉంటారు. మండలంలో ఉన్న అన్ని బ్యాంకు శాఖలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు వ్యవసాయ అధికారులే బాధ్యత వహిస్తారు.
రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను తీసుకుని వాటిని క్రాప్ లోన్ వీవర్స్ పోర్టల్లో ఉన్న సమాచారంతో సరిపోల్చి చూస్తారు. అందులో ఉన్న వివరాలను రైతులకు తెలియజేస్తారు. దీని ద్వారా రైతుకు ఎందుకు రుణం మాఫీ కాలేదో తెలిసిపోతుంది. సాంకేతి కారణాలుకూడా ఇందులో తెలిసిపోతాయి.
మరోవైపు రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. చిన్న, సన్నకారు రైతులకు అందరికీ రుణమాఫీ చేసి తీరుతామన్నారు. రుణమాఫీ కానీ రైతులు మండలకేంద్రంలోని వ్యవసాయ అధికారికి అప్లికేషన్ పెట్టుకోవాలని మంత్రి సూచించారు.
క్రాప్ లోన్ వీవర్స్ పోర్టల్లో రుణమాఫీ రాని రైతులను వివరాలను నమోదు చేయడం ద్వారా ప్రభుత్వానికి పూర్తి వివరాలు అందుతాయి. అన్ని అర్హతలు ఉంటే తర్వాత విడతలో మాఫీ అవుతుందని తెలియాజేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.