Nirmal: స్థలవివాదంలో ఓ కుటుంబాన్ని బహిష్కరించిన కులపెద్దలు

Nirmal: నిర్మల్ జిల్లా సిద్దలకుంట గ్రామం నుంచి బహిష్కరణకు గురై ఆరు నెలలైనా ఇప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది ఓ కుటుంబం.

Update: 2021-06-11 08:52 GMT

Nirmal: స్థలవివాదంలో ఓ కుటుంబాన్ని బహిష్కరించిన కులపెద్దలు

Nirmal: నిర్మల్ జిల్లా సిద్దలకుంట గ్రామం నుంచి బహిష్కరణకు గురై ఆరు నెలలైనా ఇప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది ఓ కుటుంబం. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామంలోని పెద్దల అరాచకానికి ఇప్పటికీ బహిష్కరణలోనే ఉన్న ఆ కుటుంబం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

సిద్ధలకుంటలో ఆరు నెలల క్రితం స్థల వివాదం కారణంగా ముత్యం రెడ్డి కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు. ముత్యం రెడ్డి పొలం మధ్యలో నుంచి దారి ఇవ్వాలని డిమాండ్ చేసిన వ్యతిరేక వర్గం అతను అందుకు అంగీకరించకపోవడంతో వెలివేసింది. ఆ కుటుంబంతో ఎవరూ మాట్లాడొద్దని, ఎవరూ సహాయం చేయొద్దని హుకుం జారీ చేసింది. అయితే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది బాధిత కుటుంబం.

మరోవైపు ఇప్పటికీ స్థలం కోసం వివాదం నడుస్తుండగా తమకు బెదిరింపులు కూడా వస్తున్నాయని చెబుతున్నారు బాధితులు. ఫిర్యాదు చేసి నెలరోజులు దాటినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.

Full View


Tags:    

Similar News