ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ లు.. సమాజసేవ పేరుతో మోసాలు!

చాలా మంది ఫేస్ బుక్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నారు. ముందుగా వ్య‌క్తి యొక్క బ‌యోడేటా మొత్తం ప‌రిశీలించి, అత‌ని ఫ్రెండ్ లిస్ట్ చూసి సెలెక్ట్ చేసుకొని మ‌రీ మోసాల‌కు పాల్ప‌డుతున్నారు.

Update: 2020-11-16 15:09 GMT

Facebook (File Photo)

చాలా మంది ఫేస్ బుక్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నారు. ముందుగా వ్య‌క్తి యొక్క బ‌యోడేటా మొత్తం ప‌రిశీలించి, అత‌ని ఫ్రెండ్ లిస్ట్ చూసి సెలెక్ట్ చేసుకొని మ‌రీ మోసాల‌కు పాల్ప‌డుతున్నారు.

క్రిమినల్ ఆలోచనలతో ఆరితేరిన నయవంచకులు తాము అత్యంత ధ‌న‌వంతుల‌మ‌ని, స‌మాజ సేవ చేయాల‌ని చాలా ఇంట్రెస్ట్ ఉందని... కానీ విదేశాల్లో ఉన్న కార‌ణంగా చేయ‌లేక‌పోతున్నామ‌ని న‌మ్మ‌బ‌లుకుతారు. వీలైతే సోషల్ సర్వీస్ మీరు చేయండి మేము ఆర్ధికంగా సాయం చేస్తామంటారు. వారి మాట‌లు న‌మ్మి బ్యాంక్ డిటేల్స్, వ్య‌క్తిగ‌త స‌మాచారం వారికి ఇస్తే అంతే సంగ‌తులు. మీరిచ్చిన స‌మాచారం ఆధారంగా సైబ‌ర్ మైండ్ తో మీ అకౌంట్ లోని డ‌బ్బును మాయం చేస్తున్నారు.

ఇక తాము డిల్లీ ఎయిర్ పోర్ట్ నుండి ఫోన్ చేస్తున్నామ‌ని, మీకు అద్భుత‌మైన గిఫ్ట్ పార్స‌ిల్ విదేశాల నుండి వ‌చ్చిందని ఆశ చూపుతారు. కానీ అది మీ సొంతం కావాలంటే క‌స్ట‌మ్ చార్జ‌స్ పే చేయాల‌ని చెప్తారు. ఇంకేముంది విదేశాల నుండి వ‌చ్చిందంటే ఎంతో విలువైన గిఫ్ట్ ఉంటుంద‌ని క‌స్టమ్ చార్జ‌స్ క‌ట్టేస్తారు. క‌ట్ చేస్తే డ‌బ్బు ట్రాన్స్ ఫ‌ర్ ఐన మ‌రో క్ష‌ణం నుండి వారి ఫోన్ స్విఛ్ ఆఫ్. మోస‌పోయామ‌ని ఆల‌స్యంగా తెలుసుకున్న బాధితులు సైబ‌ర్ క్రైమ్ స్టేష‌న్ ల దారి ప‌డుతున్నారు.

సోష‌ల్ మీడియాలో అప‌రిచితుల నుండి వ‌చ్చే మెసేజెస్ కు అస‌లు రెస్పాండ్ కావొద్దని సైబర్ క్రైమ్స్ డిసీపీ రోహిణి ప్రియ‌ద‌ర్శిని అంటున్నారు. చాలామంది ఫేస్ బుక్ లో సెల‌బ్రిటీ ఫోటోలు పెట్టుకొని డ‌బ్బులు వ‌సూల్ చేస్తున్నార‌ని వారి ప‌ట్ల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని డీసీపీ అన్నారు.

అనామకుల నుంచి ఎలాంటి మెసేజ్ లు గానీ, కాల్స్ గానీ వస్తే స్పందించకుండా ఉంటే మేలంటున్నారు పోలీసులు. ఒకవేళ ఎవరి మీదనైనా అనుమానం వస్తే వెంటనే సైబర్ క్రైబ్ పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.

Tags:    

Similar News