Telangana Elections: ప్రచారం.. కాస్ట్ లీ గురూ..
Telangana Elections: గత 24 గంటల్లోనే రూ.42 కోట్లు సీజ్ చేసిన పోలీసులు
Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. అక్రమంగా నగదు, మద్యం తరలించకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అంతర్రాష్ట సరిహద్దుల్లో 148 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వచ్చే వాహనాలతో పాటు, రాష్ట్రంలోను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. పెద్దఎత్తున డబ్బు, బంగారం, వస్తువులు, మద్యం స్వాధీనం చేసుకుంటున్నారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో లక్షలు, కోట్లలో నగదును వ్యక్తుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ నెల 9వ తేదీన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేయడంతో.. ఆ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచి తెలంగాణ పోలీసులు అన్ని ప్రాంతాల్లో ఎక్కడిక్కడ చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తోన్నారు. ఎలాంటి పత్రాలు, ఆధారం లేకుండా తరలిస్తున్న సొమ్మును స్వాధీనం చేసుకుంటున్నారు.
ఇప్పటివరకు ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తోన్న 286 కోట్లకు పైగా విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పెద్ద మొత్తంలో నగదు సీజ్ చేశారు. కేవలం 24 గంటల్లోనే 42 కోట్ల రూపాయలను సీజ్ చేశారు.