MLC Kavitha: కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
MLC Kavitha: జూన్ 7 వరకు కస్టడీ పొడిగించిన ఢిల్లీ కోర్టు
MLC Kavitha: లిక్కర్ పాలసీ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీని జూన్ 7 వరకు పొడిగించింది ఢిల్లీ కోర్టు. ఈ కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ... మొత్తం 11 వందల కోట్ల మేర స్కాం జరిగినట్లు తెలిపింది. ఇండో స్పిరిట్స్ 192 కోట్ల మేర లాభాలను పొందినట్లు వెల్లడించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఈ వ్యవహారంలో..100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చినట్లు ఛార్జ్ షీట్‌లో పేర్కొంది ఈడీ. ఈ కేసులో కవిత పాత్ర ఉందని..ఆమె డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేశారని తెలిపింది. ఇక ఇదే కేసుకు సంబంధించి.. జూన్ 7న ఛార్జ్‌షీట్ దాఖలు చేయనుంది సీబీఐ.