Adilabad: ఆదిలాబాద్‌ రిమ్స్‌లో కాలంచెల్లిన ఇంజక్షన్ల కలకలం

Adilabad: రోగులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది * కాలంచెల్లిన ఇంజక్షన్‌లను గుర్తించిన రోగి బంధువులు

Update: 2021-06-14 08:20 GMT

ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ (ఫైల్ ఇమేజ్)

Adilabad: ఆదిలాబాద్‌ రిమ్స్‌లో వైద్య సిబ్బంది నిర్వాకం మరోసారి బయట పడింది. పేషంట్స్‌ పట్ల ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. రోగులకు కాలం చెల్లిన ఇంజక్షన్లు ఇస్తున్నట్లు పేషంట్స్‌ బంధువులు గుర్తించారు. ఓ పేషంట్‌కు ఇంజక్షన్‌ ఇస్తుండగా రోగి బంధువులు గుర్తించి సిబ్బందిని రోగుల బంధువులు నిలదీశారు. వార్డులో ఉన్నవారందరికీ ఎక్సపైర్ అయిపోయిన ఇంజక్షన్‌ ఇస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. విషయం పెద్దదవుతుండటంతో ఇంజక్షన్స్‌ను నర్స్‌ డస్ట్‌ బిన్‌లో పడేశారు. రిమ్స్‌ వైద్య సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    

Similar News