గ్రేటర్ ఎగ్జిట్‌ పోల్స్‌లో టీఆర్ఎస్‌కే పట్టం!

జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లకు ఈనెల ఒకటిన పోలింగ్‌ జరిగింది. టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్‌ ఫలితాలు విడుదల చేసింది.

Update: 2020-12-03 13:10 GMT

జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లకు ఈనెల ఒకటిన పోలింగ్‌ జరిగింది. టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్‌ ఫలితాలు విడుదల చేసింది. పీపుల్స్ పల్స్ సర్వే ఈ విధంగా ఉంది. పీపుల్స్ పల్స్ సంస్థ అంచనాల ప్రకారం.. టీఆర్ఎస్‌కు 68 డివిజన్ల నుంచి 78 డివిజన్లలో గెలుపొందే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది. ఇక బీజేపీ 25 నుంచి 35, ఎంఐఎం 38 నుంచి 42, కాంగ్రెస్‌ ఒకటి నుంచి ఐదు స్థానాలు గెలవనున్నట్లు పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్‌ ఫలితాలు విడుదల చేసింది.

ఇక మరోసంస్థ నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ 113 డివిజన్లలో సర్వే నిర్వహించింది. ఈ సంస్థ ఎగ్జిట్ ఫలితాలు చూస్తే టీఆర్ఎస్‌కు 85 డివిజన్ల నుంచి 95 డివిజన్లు కైవసం చేసుకోనున్నట్లు వెల్లడించింది. బీజేపీకి 15 నుంచి 25 వరకు... కాంగ్రెస్‌ మూడు స్థానాలు గెలుచుకోన్నట్లు తెలిపింది. అయితే నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ సంస్థ చేసిన 113 డివిజన్లలో ఎంఐఎంకు ఒక్క డివిజన్‌ కూడా గెలిచే అవకాశం లేనట్లు ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల్లో తెలిపింది.

మరో సంస్థ ఆరా... ఎగ్జిట్ ఫలితాలను చూస్తే టీఆర్ఎస్‌ 78 డివిజన్లలో విజయం సాధించవచ్చని తెలిపింది. అటు ఇటుగా మరో 7 సీట్లు టీఆర్ఎస్‌ తన ఖాతాలో వేసుకున్నట్లు ఆరా వెల్లడించింది. ఇక బీజేపీకి 28 నుంచి 33 డివిజన్లు... ఎంఐఎంకు 41 నుంచి 45 డివిజన్లు.. కాంగ్రెస్‌ 3 డివిజన్ల నుంచి 6 డివిజన్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు సంస్థ తెలిపింది.

Tags:    

Similar News