దేశవ్యాప్తంగా రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఢిల్లీ ఎయిమ్స్‌లో ప్రధాని మోడీ కరోనా టీకా వేయించుకున్నారు. అలాగే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఇక తెలంగాణలో కూడా సెకండ్ ఫేస్ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. హుజూరాబాద్ పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా రెండో దశ వ్యాప్తి లేదని చెప్పారు. 60 ఏండ్లు పైబడినవారితోపాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు టీకా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు వద్దని సూచించారు. అర్హులైన వారంతా టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న ఆస్పత్రిల్లో టీకా వేయించుకోవాలని కోరారు.