Etela Rajender: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం

Etela Rajender: పథకం ప్రకారం తనపై కుట్ర పన్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.

Update: 2021-05-03 06:48 GMT

ఈటల ఫైల్ ఫోటో 

Etela Rajender: తెలంగాణ రాజ‌కీయాల్లో ఈట‌ల వ్య‌వ‌హారం పెద్ద దూమారం రేపుతుంది. ఊహించిన విధంగానే ఈటలను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. టీఆర్ఎస్ తో పాటు రాజకీయ వర్గాల్లోనే ఈటల ఎపిసోడ్ పై ప్రధాన చర్చ జరుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఈట‌లను తొలిగించిన త‌ర్వాత‌ తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడుతూ..పథకం ప్రకారం తనపై కుట్ర పన్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధమని.. హుజూరాబాద్‌ ప్రజలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని ఈటల తెలిపారు.

ఈ సంద‌ర్బంగా కేసీఆర్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్‌ తన శక్తిని మొత్తం నాపై పెట్టారు. కేసీఆర్‌ ఎప్పుడూ డబ్బును నమ్ముకోలేదు. ఆనాడు కేసీఆర్ అణచివేతకు భయపడలేదు. ఇలాంటి చర్యలు కేసీఆర్ గౌరవాన్ని పెంచవు అంటూ ఈటల అన్నారు. గతంలో పార్టీ ఆదేశిస్తే రాజీనామా చేసి మళ్లీ గెలిచా. 2008లో 16 మంది రాజీనామా చేస్తే ఏడుగురు గెలిచారు.. అందులో నేను ఒకడిని. శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ నాకు అవకాశం కల్పించారు. ఉద్యమ నేతగా, మంత్రిగా పార్టీకి మచ్చ తెచ్చే ప్రయత్నం చేయలేదని ఈటల రాజేంద్ర వాఖ్యానించారు.


Tags:    

Similar News