Etela Rajender Review on Corona: ఏ జిల్లా రోగులకు ఆ జిల్లాలోనే.. కరోనా ట్రీట్ మెంట్ పై తెలంగాణా మంత్రి స్పష్టం

Etela Rajender Review on Corona: కరోనా వైరస్ తీవ్రమవుతోంది. వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అవకాశమున్న రోగులు ఒక జిల్లా నుంచి వేరే జిల్లాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు.

Update: 2020-07-29 03:34 GMT
RAJENDER ETELA

Etela Rajender Review on Corona: కరోనా వైరస్ తీవ్రమవుతోంది. వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అవకాశమున్న రోగులు ఒక జిల్లా నుంచి వేరే జిల్లాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. వీటివల్ల స్థానికంగా ఉండే రోగులకు సమస్యలు ఎదురవుతున్నాయి. దీన్ని అధికమించేందుకు తెలంగాణా వైద్య శాఖ మంత్రి ఈటెల ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు వివరించారు. ఇక నుంచి ఏ జిల్లోలోని రోగులకు ఆ జిల్లాలోనే చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.

సామాజిక స‌మ‌స్య‌గా మారిన క‌రోనే వైర‌స్ విస్తృతిని అడ్డుకోవ‌డానికి అన్ని ర‌కాలుగా ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంది. డ‌బ్బుల‌కు కొదువ లేదు. కావాల్సింద‌ల్లా ట్రీట్ మెంటు తోపాటు వైర‌స్ ని ఎదుర్కొనే సంక‌ల్పం, ధైర్యం. ఆ ధైర్యాన్ని ప్ర‌జ‌లకు ఇవ్వాలి. 24 గంట‌ల‌పాటూ వైద్యులు అందుబాటులోఉండాలి. ఏ జిల్లా క‌రోనా బాధితుల‌కు ఆ జిల్లాలోనే ట్రీట్ మెంట్ జ‌ర‌గాలి. అందుకు అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల స‌దుపాయాల‌ను క‌ల్పిస్తాం. అని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్, రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఇద్ద‌రు మంత్రులు, వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లా ప్ర‌జాప్ర‌తినిధులు, క‌లెక్ట‌ర్లు, వైద్యాధికారుల‌తో క‌లిసి క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌పై వ‌రంగ‌ల్ హంట‌ర్ రోడ్డులోని ఓ ఫంక్ష‌న్ హాలులో మంగ‌ళ‌వారం సుదీర్ఘంగా స‌మీక్ష నిర్వ‌హించారు. జిల్లాల వారీగా క‌రోనా వైర‌స్ విస్తృతి ప‌రిస్థితుల‌ను కూలంక‌షంగా చ‌ర్చించారు. అనంత‌రం మీడియాతో మాట్లారు.

ఈ సంద‌ర్భంగా మంత్రులు మాట్లాడుతూ, మ‌న రాష్ట్రంలో 81శాతం మంది క‌రోనా బాధితుల్లో ఏమాత్రం వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డం లేదు. అందులో కేవ‌లం 19శాతం మందికి మాత్ర‌మే జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి.ఇందులోనూ 14శాతం మంది న‌యం అవుతున్నారు. కేవ‌లం 4 నుంచి 5శాతం అంత‌కుముందే జ‌బ్బులున్న సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు మాత్ర‌మే స‌మ‌స్య ఉంది. వాళ్ళ‌ని కాపాడుకునే బాధ్య‌త ప్ర‌భుత్వం మీద ఉంది.

ప్ర‌భుత్వం ఆదేశాల ప్ర‌కారం...డాక్ట‌ర్లు, సిబ్బంది, అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండి, స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాలి. అని ఆదేశాలిచ్చారు. ఇక నుంచి 24 గంట‌ల పాటు క‌రోనాకి చికిత్స అందించే డాక్ట‌ర్లు, సిబ్బంది విధుల్లో ఉండాలి. ఏ జిల్లా క‌రోనా బాధితుల‌కు ఆ జిల్లాలోనే చికిత్స‌లు అందించాలి. అందుకు అవ‌స‌ర‌మైన అన్ని స‌దుపాయాల‌ను ప్ర‌భుత్వం క‌ల్పిస్తుంది. కావాల్సిన ఇండెంట్లు పెట్టండి. ఏ ఒక్క పేషంట్ కి కూడా వైద్యం అంద‌లేద‌న్న పేరు రావొద్ద‌ని మంత్రులు చెప్పారు. త్వ‌ర‌లోనే వ‌రంగ‌ల్ లో అద‌నంగా 250 క‌రోనా ప‌డ‌క‌లు అందుబాటులోకి వ‌స్తాయి. మ‌రో 15రోజుల్లో పిఎంఎస్ఎస్ వై సూప‌ర్ స్పెషాలిటీ ద‌వాఖానాని అందుబాటులోకి తెస్తాం. అని మంత్రులు ఈట‌ల‌, ఎర్ర‌బెల్లి వివ‌రించారు

Tags:    

Similar News