Etela Rajender Review on Corona: కరోనా కట్టడికి ట్రేసింగ్‌.. టెస్టింగ్‌.. ట్రీట్‌మెంట్‌..

Etela Rajender Review on Corona: కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ట్రేసింగ్.. టెస్టింగ్.. ట్రీట్మెంట్ నిరంతరాయంగా కొనసాగుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

Update: 2020-07-29 13:42 GMT
etela rajender

Etela Rajender Review on Corona: కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ట్రేసింగ్.. టెస్టింగ్.. ట్రీట్మెంట్ నిరంతరాయంగా కొనసాగుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా నిర్ధారిత పరీక్షలు చేస్తున్నామన్నారు. రిటైర్డ్ వైద్యులను వారి సేవలు అందించాలని కోరాం అని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రోజుకు 17 వేల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిని వయసు పై బడిన వారు... దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు...గర్భిణిలుగా విభజించి వైద్యం అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం వెలుగు చూస్తున్న కేసుల్లో 19 శాతం మందికి లక్షణాలు ఉంటున్నాయని తెలిపారు. ప్రస్తుతం 1100 సెంటర్స్ లో పరీక్షలు చేస్తున్నామన్నారు ఈటల రాజేందర్. కరోనా రోగుల్లో కేవలం ఐదు శాతం మందికే ఆక్సిజన్ అవసరం అవుతుందని తెలిపారు.

బస్తీల్లో ఉండే వృద్దుల నుంచి స్వాబ్ కలెక్షన్ చేయడానికి ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ బస్సులు కంటైన్మెంట్ జోన్లలో అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు. పార్టీలు, సంస్థలు, ప్రజా సంఘాలు ... విధులు నిర్వహిస్తున్న వారికి ధైర్యం చెప్పాలని ఈటల కోరారు. వైద్య సిబ్బంది ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు.

రాష్ట్రంలో 81 శాతం మంది బాధితులు కరోనా లక్షణాలు లేకుండానే కోలుకోవడమే ఇందుకు నిదర్శనమని ఈటల అన్నారు. కరోనా బాధితులకు అన్ని రకాలుగా అండగా నిలిచి వారికి మరింత సేవలందించాలని ఆరోగ్య అధికారులకు మంత్రి సూచించారు. కరోనా వైరస్‌ను సకాలంలో గుర్తించని వారికి ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు. కరోనా సోకిందని ప్రజలు భయపడకుండా వైరస్‌ను ధైర్యంగా ఎదుర్కొందామని ఈటల పిలుపునిచ్చారు. వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారు తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించాల్సిందేనని మంత్రి సూచించారు. పూర్వం అనేక రకాల ప్రమాదకర వ్యాధులను ఎదుర్కొని వాటి నుంచి సురక్షితంగా బయటపడ్డ సత్తా మన సొంతమని గుర్తు చేశారు.


Tags:    

Similar News