నడ్డాతో భేటీలో పలు సందేహాలను వ్యక్తం చేసిన ఈటల.. ఆ ఛాన్సే లేదని క్లారిటీ ఇచ్చిన నడ్డా

Etela Rajender: ఈటల రాజేందర్‌ ఢిల్లీ టూర్‌తో బీజేపీలో చేరడం కన్‌ఫామ్‌ అని క్లారిటీ వచ్చింది.

Update: 2021-06-01 07:08 GMT

నడ్డాతో భేటీలో పలు సందేహాలను వ్యక్తం చేసిన ఈటల.. ఆ ఛాన్సే లేదని క్లారిటీ ఇచ్చిన నడ్డా

Etela Rajender: ఈటల రాజేందర్‌ ఢిల్లీ టూర్‌తో బీజేపీలో చేరడం కన్‌ఫామ్‌ అని క్లారిటీ వచ్చింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఈటల భేటీ అయ్యి ఆయనకున్న డౌట్స్‌ అన్నింటిని క్లారిఫై చేసుకున్నారు. పార్టీలో చేరితే తనకు ప్రాధాన్య ఇవ్వాలని కోరారు. దానికి జేడీ నడ్డా ఓకే అనేశారు. ఇంతలో ఈటలకు ఓ డౌట్‌ వచ్చింది. ఫ్యూచర్‌లో బీజేపీ, టీఆర్ఎస్‌ ఒక్కటైతే తన పరిస్థితి ఎంటని క్వశన్‌ చేశారు.

వాస్తవానికి రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ ఒకటేనన్న భావన ప్రజల్లో ఉంది. టీఆర్ఎస్‌ నాయకత్వం కూడా అలా సీన్‌ క్రియేట్‌ చేస్తోంది. మొదట కేంద్ర ప్రభుత్వ పథకాలను కేసీఆర్‌ తిడతారు. తర్వాత వాటిని అమలు చేసుకుంటూ వెళ్తారు. ఆయుష్మాన్‌భారత్‌ వంటి పలు పథకాలు ఇందుకు సాక్ష్యం. ఇలాంటి ఎన్నో అనుమానాలను జేపీ నడ్డా ముందు ఉంచారు ఈటల.

ఈటల డౌట్‌ను జేపీ నడ్డా క్లారిఫై చేశారు. ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకునే ఛాన్సే లేదని ఆయన మాట ఇచ్చారు. పశ్చిమబెంగాల్‌లో మూడు స్థానాల నుంచి అధికారం చేపడతామనే స్థాయికి ఎదిగామని గుర్తుచేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జేపీ నడ్డా అన్నారు. జేపీ నడ్డా హామీ ఇవ్వడంతో ఈటల సంతృప్తి చెందారట. త్వరలో నిర్ణయం తీసుకొని బీజేపీలో చేరుతానంటూ చెప్పేశారు.

నడ్డాతో భేటీ అనంతరం బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌, రవీందర్‌రెడ్డి, వివేక్‌లు తరుణ్‌చుగ్‌ ఇంటికి వెళ్లారు. అక్కడే రాత్రి భోజనం చేశారు. వీలునిబట్టి ఢిల్లీలో ఒకరిద్దరు బీజేపీ నేతలను ఈటల కలిసే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News