Etala Rajendar: డి.శ్రీనివాస్‌తో ఈటల భేటీ

Etala Rajendar: భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ భవిష్యత్ యాక్షన్ ప్లాన్‌పై సర్వత్రా ఆసక్తి

Update: 2021-05-12 12:05 GMT

ఈటెల రాజేందర్ (ఫైల్ ఇమేజ్)

Etala Rajendar: భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ భవిష్యత్ యాక్షన్ ప్లాన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్యూచర్‌ ప్లాన్ కోసం సొంత నియోజకవర్గానికి వెళ్లిన ఈటల అనుచరులు పార్టీ నేతలు, కార్యకర్తలతో చర్చించి వచ్చారు. అయితే ఈటల మనసులో ఏముందన్నది అంతుచిక్కడం లేదు. మంత్రి పదవి నుంచి ఆయనను బర్తరఫ్‌ చేసిన నేపథ్యంలో ఈటల తన రాజకీయ వ్యూహరచనలో నిమగ్నం అయ్యారు. తాజాగా రాజ్యసభ సభ్యులు డి. శ్రీనివాస్‌తో మాజీ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. గంటన్నరకు పైగా డీఎస్‌తో ఈటల చర్చలు జరిపారు. భవిష్యత్ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కోవిడ్ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పిన ఈటల తన పోరాటానికి మద్దతు ఇవ్వాలని నేతలను కలిసి కోరుతున్న విషయం తెలిసిందే.

ఈ భేటీలో తండ్రి డీఎస్‌తో పాటు బీజేపీ ఎంపీ అరవింద్‌ కూడా పాల్గొన్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిలతో ఈటల భేటీ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడైన డీఎస్‌తో భేటీ కావటం రాజకీయంగా చర్చనీయ అంశంగా మారింది. ఇక గత కొన్ని రోజులుగా డీఎస్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ పరమైన కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.

Tags:    

Similar News