ESI scam: ఈడీ సోదాల్లో భారీగా నగదు, ఆస్తులు లభ్యం

ESI scam: హైదరాబాద్‌లో ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం పది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. ఈ సోదాల్లో భారీగా నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు.

Update: 2021-04-10 14:19 GMT

ESI scam: ఈడీ సోదాల్లో భారీగా నగదు, ఆస్తులు లభ్యం

ESI scam: హైదరాబాద్‌లో ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం పది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. ఈ సోదాల్లో భారీగా నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. అధిక మొత్తంలో నోట్ల కట్టలు, కోటికి పైగా విలువైన బంగారు ఆభరణాలతో పాటు, బ్లాంక్‌ చెక్కులు, ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు.

ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో డీడీ కాలనీలోని నాయిని నర్సింహారెడ్డి మాజీ పర్సనల్‌ సెక్రటరీ ముకుందరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఆయన నుంచి కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ రైడ్స్‌ అనంతరం వీడియోను చిత్రీకరించారు అధికారులు. ముకుందరెడ్డి బంధువు వినయ్‌రెడ్డి ఇంట్లోనూ సోదాలు చేపట్టి భారీగా నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అలాగే నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు నిర్వహించారు అధికారులు. భారీగా డబ్బు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు ఏడు డొల్ల కంపెనీల నిర్వాహకుడు బుర్ర ప్రమోద్‌రెడ్డి ఇంట్లోనూ సోదాలు చేపట్టారు ఈడీ అధికారులు. భారీగా నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. డొల్ల కంపెనీల వెనుక కొందరు రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్టు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు షేక్‌పేట్‌లోని ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌ దేవికారాణి ఇంట్లోనూ సోదాలు చేపట్టారు ఈడీ అధికారులు. కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఈఎస్‌ఐ స్కామ్‌కు సంబంధించి పలు ప్రాంతాల్లో ఉదయం నుంచీ ఈడీ రైడ్స్‌ కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News