Telangana: ఆస్పత్రుల్లో ఖాళీగా కనిపిస్తున్న బెడ్స్
Telangana: నెలరోజుల క్రితం తెలంగాణలో కోవిడ్ రోగులకు బెడ్స్ దొరకడం గగనం.
Telangana: నెలరోజుల క్రితం తెలంగాణలో కోవిడ్ రోగులకు బెడ్స్ దొరకడం గగనం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కొత్త కేసులు తగ్గుతున్నాయి. రికవరీ కేసులు పెరుగుతున్నాయి. దీంతో బెడ్స్ ఖాళీగా ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇటు ఐసీయూ బెడ్స్ కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇన్నాళ్లు కరోనా పేషెంట్లతో కళకళలాడిన బెడ్స్ ఇప్పుడు వెలవెలబోతున్నాయి. కరోనా కేసులు కంట్రోల్‌కి వచ్చాయి. పేషెంట్లు కూడా కోలుకొని డిశ్చార్జి అవుతున్నారు. దీంతో ఆస్పత్రుల్లో బెడ్స్ ఖాళీగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ల కోసం 2వేల 2వందల 50 బెడ్స్ కేటాయిచారు. గచ్చిబౌలి టీమ్స్‌లో 12వందల 60 బెడ్స్, కింక్ కోఠిలో 400 బెడ్స్ సెట్ చేశారు. నెల రోజుల క్రితం వరకు అన్ని బెడ్స్ ఫుల్‌గా ఉండేవి. ఇక ఆక్సిజన్, వెంటిలేటర్ బెడ్ కావాలంటే ఎదురుచూపులు తప్పేవి కావు.
లాక్‌డౌన్ పుణ్యమని కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇటు కరోనా పేషెంట్లు ఆస్పత్రుల నుంచి ఇంటిబాట పట్టారు. దీంతో ఆస్పత్రుల్లో బెడ్స్ ఖాళీ అవుతున్నాయి. దీంతో వైద్యాధికారులు సాధారణ రోగులకి వైద్యం అందించేందుకు సన్నద్ధమవుతున్నారు.
కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి గాంధీ, టిమ్స్ ఆస్పత్రుల్లో సాధారణ వైద్యానికి విరామం ఇచ్చారు. ఎక్కవగా కరోనా చికిత్సపైనే దృష్టిసారించారు. ఇప్పుడు మళ్లీ సాధారణ వైద్యానికి వెసలుబాటు కల్పిస్తామంటున్నారు. అయితే మరికొందరు వైద్యులు మాత్రం కొన్నాళ్లు వెయిట్ చేస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.