Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రకు ఎన్నికల కోడ్ కష్టాలు
Bandi Sanjay: కన్ఫ్యూజన్‌లో బీజేపీ రాష్ట్ర నాయకత్వం
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్రకు ఎన్నికల కోడ్ కష్టాలు మొదలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధఠంగా కఠిన నిబంధనలు విధించింది కేంద్ర ఎన్నికల సంఘం. నియోజకవర్గంలో ఎలాంటి బహిరంగ సభలు నిర్వహించొద్దంటూ ఆదేశాలిచ్చింది. అయితే మొదటి విడత పాదయాత్ర ముగింపు సభ.. భారీ జనసమీకరణతో పెట్టాలనీ బీజేపీ ప్లాన్ చేసింది. అక్టోబర్ 2న హుజూరాబాద్‌లో ఈ సభ జరపాలని కమలం పార్టీ భావించింది. అయితే ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో.. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కన్ఫ్యూజన్‌లో పడింది. కరీంనగర్ జిల్లాకు సమీపంలోని ప్రాంతంలో సభ పెట్టాలని భావిస్తోంది బీజేపీ.