Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో రికార్డు.. ఎమ్మెల్యేలుగా గెలిచిన 15 మంది వైద్యులు

Telangana Elections: తాజా ఎన్నికల్లో సత్తాచాటి ఏకంగా 15 మంది వైద్యులు అసెంబ్లీలోకి అడుగు పెట్టారు.

Update: 2023-12-04 08:34 GMT

Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో రికార్డు.. ఎమ్మెల్యేలుగా గెలిచిన 15 మంది వైద్యులు

Telangana Elections: తాజా ఎన్నికల్లో సత్తాచాటి ఏకంగా 15 మంది వైద్యులు అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. వైద్య వృత్తిలో రాణిస్తూనే రాజకీయ పార్టీలిచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వీరిలో నలుగురు జనరల్‌ సర్జన్లు కాగా, ఒకరు జనరల్‌ ఫిజీషియన్, మరొకరు పీడియాట్రిక్స్‌ కాగా ఒకరు న్యూరో సర్జన్‌ ఉన్నారు.

ఇక ముగ్గురు ఎంఎస్‌ ఆర్థో ఉండగా, మరొకరు డెంటల్‌ సర్జన్‌. ఇద్దరు ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన వారున్నారు. వీరిలో దాదాపు అందరూ తొలిసారిగా పోటీ చేసిన వారే కావడం గమనార్హం. తాజాగా గెలిచిన 15 మంది వైద్యుల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి 11 మంది విజయం సాధించగా... బీఆర్‌ఎస్‌ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరు గెలుపొందారుడాక్టర్‌.

రామచంద్రునాయక్‌ (ఎంఎస్‌ సర్జన్‌), డోర్నకల్‌

డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ (ఎంఎస్‌ సర్జన్‌), అచ్చంపేట

డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌బాబు (ఎంఎస్‌ ఆర్థో), సిర్పూర్‌

డాక్టర్‌ మురళీనాయక్‌ (ఎంఎస్‌ సర్జన్‌), మహబూబాబాద్‌

డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ (ఎంఎస్‌ సర్జన్‌), మానకొండూరు

డాక్టర్‌ చిట్టెం పర్ణికారెడ్డి (ఎండీ రేడియాలజీ), నారాయణపేట

డాక్టర్‌ పటోళ్ల సంజీవరెడ్డి (పీడియాట్రిషన్‌), నారాయణఖేడ్‌

డాక్టర్‌ మైనంపల్లి రోహిత్‌ (ఎంబీబీఎస్‌), మెదక్‌

డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ (కంటి డాక్టర్‌), జగిత్యాల

డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ (న్యూరోస్పైన్‌ సర్జన్‌), కోరుట్ల

డాక్టర్‌ గడ్డం వివేక్‌ వెంకట్‌స్వామి (ఎంబీబీఎస్‌), చెన్నూరు

డాక్టర్‌ తెల్లం వెంట్రావు (ఆర్థో), భద్రాచలం

డాక్టర్‌ కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి (డెంటల్‌), నాగర్‌కర్నూల్‌

డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డి (పిడియాట్రిషన్‌), నిజామాబాద్‌ రూరల్‌

డాక్టర్‌ మట్టా రాగమయి (పల్మనాలజిస్ట్‌), సత్తుపల్లి

Tags:    

Similar News