Nizamabad MLC Election : అద్భుతం జరిగితే తప్ప టీఆర్‌ఆఎస్..

జామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతోంది. 50 కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. 399 మంది..

Update: 2020-10-09 02:36 GMT

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతోంది. 50 కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. 399 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు.. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్నిచర్యలు తీసుకున్నారు.. కలెక్టర్‌ నారాయణ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. టీఆర్‌ఆఎస్‌ అభ్యర్థిగా నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత, కాంగ్రెస్‌ అభ్యర్థిగా వడ్డే పల్లి సుభాష్ రెడ్డి, బీజేపీ నుంచి పోతన్ కర్ లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. మొత్తం 824 మంది ఓటర్లలో.. 49 జెడ్పీటీసీలు, 535 ఎంపీటీసీలు, 226 మంది కౌన్సిలర్లు, ఇతరులు 12 మంది ఉన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం నల్లేరుమీద నడకలా ఉంది. ఆ పార్టీకి‌ 494 ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ కు‌ 140, బీజేపీ 84, స్వతంత్రులు 66, ఎంఐఎంకు 28 ఓట్లున్నాయి. ఈ ఎన్నికలకు 14 సమస్యాత్మక ప్రాంతాలుగా ఎన్నికల కమిషన్ గుర్తించింది.

బాన్సువాడ లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓటు వేయనున్నారు, భీంగల్ లో మంత్రి ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ జడ్పీ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్, జీవన్ రెడ్డి , ఎంపీ అరవింద్, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, విజి గౌడ్, రాజేశ్వర్ లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరోవైపు ప్రభుత్వ విప్ విప్ గంప గోవర్దన్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో, ఎల్లారెడ్డి లో ఎమ్మెల్యే జాజుల సురేందర్, బోధన్ లో షకీల్ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ ఓటు నమోదు చేసుకోలేదు.. రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డికి ఇంకా ఓటు రాలేదు.

Tags:    

Similar News