Lok Sabha Elections 2024: తెలంగాణలో పీక్ స్టేజ్‌లో ఎన్నికల ప్రచారాల హోరు

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మూడు పార్టీల వ్యూహాలు

Update: 2024-04-10 10:18 GMT

Lok Sabha Elections 2024: తెలంగాణలో పీక్ స్టేజ్‌లో ఎన్నికల ప్రచారాల హోరు

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు టార్గె్ట్‌గా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికలకు ముందే నేరుగా ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది కమలం పార్టీ. బూత్ కార్యకర్త నుంచి జాతీయ నేతలంతా ప్రతి ఇంటికి వెళ్లేలా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే పార్లమెంట్ సమ్మేళనాలతో ముందుకెళ్తోన్న బీజేపీ.. బూత్ అధ్యక్షులు, పై స్థాయి నేతలతోనూ సమావేశాలు నిర్వహిస్తున్నారు పార్లమెంట్ అభ్యర్థులు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేస్తోంది. ఇక ఈ నెల 17న లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ కానున్న నేపథ్యంలో రాష్ట్ర నేతల ఆధ్వర్యంలోనే సమ్మేళనాలు నిర్వహించేలా రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేస్తోంది. ఈ నెల 11, 12, 13వ తేదీల్లో మండలాల సమావేశాలు, 15, 16, 17వ తేదీల్లో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక 20వ తేదీ తర్వాత నామినేషన్ల దాఖలుతో పాటు జాతీయ నేతల పర్యటనలు ఉండేలా ప్లాన్ చేస్తోంది రాష్ట్ర నాయకత్వం. ఏఏ తేదీల్లో ఎవరు రావాలనే దానిపై షెడ్యూల్ ప్రిపేర్ చేస్తోంది స్టేట్ కేడర్.ముఖ్యంగా ప్రధాని మోడీ చేసిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని వారు బలంగా విశ్వసిస్తున్నారు. వాటిని ఎంత బాగా ప్రచారం చేస్తే.. తమకు అంత మేలు కలుగుతుందని నమ్ముతున్నారు.మరోవైపు కేంద్ర నాయకుల ప్రచారాలు.. ముఖ్యంగా ప్రధాని మోడీ బహిరంగ సభలు ద్వారా తమకు మరింత మేలు కలుగుతుందని బలంగా విశ్వసిస్తున్నారు.

ఇక లోక్‌సభ ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతుండడంతో ప్రచార బరిలోకి దిగనున్నారు గులాబీ బాస్ కేసీఆర్. ఈ నెల 13న చేవెళ్లలో బీఆర్ఎస్ నిర్వహించబోయే బహిరంగ సభతో ఆయన ప్రచార హోరును పెంచనున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు దీటుగా ప్రచారం చేయాలని నిర్ణయించారు బీఆర్ఎస్ అధినేత. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలే ప్రచార అస్త్రాలుగా రంగంలోకి దిగనున్నారు కేసీఆర్. మరో వైపు పార్టీని కాపాడుకునేందుకు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు గులాబీ బాస్. అటు పార్టీ నుంచి వలసలు నిలిచిపోవాలంటే లోక్‌సభ ఎన్ని్కల్లో గెలిచి తమ సత్తా చాటాలనే యోచనలో ఉన్నారు. అటు కేసీఆర్‌కు చేదోడు వాదోడుగా కేటీఆర్, హరీష్‌రావు పర్యటిస్తున్నారు. ఇప్పటికే లోక్‌సభ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాలు పూర్తి చేసింది. ఇక నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని డెసిషన్ తీసుకున్నారు. గెలుపు అవకాశాలు ఉన్న స్థానాలపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఏదేమైనా గులాబీ పార్టీని విజయ తీరాలకు చేర్చాలనే లక్ష్యంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రచార బరిలోకి దిగుతున్నారు.

అటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంట్ ఎన్నికల కోసం ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటోంది. మెజార్టీ సీట్లు గెలుపే టార్గెట్‌గా హస్తం పార్టీ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ఎంపిక, సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు. అటు సీఎం రేవంత్‌రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వంద రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కాంగ్రెస్ అధిష్టానం రిలీజ్ చేసిన పాంచ్ న్యాయ్‌లను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా హస్తం పార్టీ ప్లాన్ చేస్తోంది. మరోవైపు నియోజకవర్గాల వారీగా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తోంది. ఎన్నికల దగ్గరలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని ప్లాన్స్ చేస్తున్న హస్తం పార్టీ. కేంద్ర నాయకుల్ని పిలిపించి బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

Tags:    

Similar News