MLC Kavitha: ఇవాళ కవితను విచారించనున్న ఈడీ

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన కవిత

Update: 2024-03-17 03:27 GMT

MLC Kavitha: ఇవాళ కవితను విచారించనున్న ఈడీ

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇవాళ ఈడీ విచారించనున్నది. ఏడు రోజులు పాటు కస్టడీలోకి తీసుకున్న ఈడీ తొలిరోజు లిక్కర్ పాలసీపై వివరాలు సేకరించనున్నది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, న్యాయవాదులు కలిసేందుకు అనుతిచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో మీడియా ప్రతినిధులు మాట్లేడేందుకు ప్రయత్నించినా మాట్లాడుకుండా బీఆర్ఎస్ నేతలు వెళ్లిపోయారు. మధ్యాహ్నం లంచ్ సమయంలో కవితను కలువనున్నారు.

మరో వైపు కవిత రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. లిక్కర్ స్కాం కేసులో కవిత కీలకంగా ఉన్నారని స్పష్టం చేసింది ఈడీ. కవితను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చింది ఈడీ. కవితను 10 రోజుల కస్టడీకి అనుమతిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని తెలిపింది ఈడీ. సౌత్ లాబీ పేరుతో లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించినట్లు అభియోగం మోపింది ఈడీ. ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల రూపాయలు ఇవ్వడంలో ఎమ్మెల్సీ కవిత కీలక పాత్ర అంటూ ఈడీ తన రిమాండ్ రిపోర్టులో తెలిపింది.

రామచంద్రపిళ్లై ద్వారానే ఈ వ్యవహారాన్ని అంతా నడిపినట్లు వివరించింది. కవితకు బినామీగా రామచంద్రపిళ్లై వ్యవహరించినట్లు ఈడీ స్పష్టం చేసింది. ఎంపీ మాగుంట ద్వారా 30 కోట్ల రూపాయలను కవిత ఢిల్లీకి తరలించినట్లు ఈడీ తెలిపింది. అభిషేక్ బోయినపల్లి ఈ డబ్బును తరలించారని తెలిపింది. హవాలా ద్వారా ఈ డబ్బును ఢిల్లీ చేరవేశారని తెలిపింది ఈడీ. అటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాతో ఎమ్మెల్సీ కవిత పలుమార్లు ఫోన్ లో మాట్లాడినట్లు ఈడీ తన రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. 

Tags:    

Similar News