MLC Kavitha: నాలుగో రోజు కవితను విచారించనున్న ఈడీ

MLC Kavitha: తన అరెస్ట్‌పై సుప్రీంకోర్టులో కవిత మరో పిటిషన్

Update: 2024-03-20 03:31 GMT

MLC Kavitha: నాలుగో రోజు కవితను విచారించనున్న ఈడీ

MLC Kavitha: నాలుగో రోజు ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించనుంది. నిన్న కవితను ఈడీ అధికారులు సుధీర్ఘంగా విచారించారు. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, సహ నిందితుల నుండి రాబట్టిన వివరాల ఆధారంగా దాదాపు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు ఇంకా మూడు రోజులే సమయం ఉండటంతో ఈడీ దూకుడు పెంచనుందని సమాచారం.

ఈడీ కస్టడీలో ఉన్న తనను కలిసేందుకు అమ్మ, పిల్లలకు అనుమతివ్వాలని ఎమ్మెల్సీ కవిత రౌస్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించారు. తల్లి శోభ, కొడుకులను కలుసుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని అభ్యర్థించారు. కవిత విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొన్న ధర్మాసనం..తల్లి, కొడుకు, కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతించింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అరెస్ట్, రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన అరెస్టు అక్రమమని, రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ తీరును నిరసిస్తూ.. మొత్తం 537 పేజీల సమగ్ర వివరాలతో కవిత తరఫు న్యాయవాది మోహిత్ రావు సుప్రీం కోర్టులో ఫ్రెష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ సుప్రీం కోర్టులో ఈరోజు లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. 

Tags:    

Similar News