కార్వీ స్కామ్‌లో ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
Karvy Scam: కార్వీ సంస్థకు చెందిన రూ.110 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
Karvy Scam: కార్వీ స్కామ్‌లో దర్యాప్తు వేగవంతం చేసింది ఈడీ. సంస్థకు చెందిన 110 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. మనీలాండరింగ్ యాక్డ్ కింద కార్వీపై ఇప్పటికే కేసు నమోదు చేసిన ఈడీ షేర్లు, భూములు, భవనాల షేర్లు, విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు జప్తు చేసింది. గతంలో 19 వందల 84.8 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. ఖాతాదారులకు చెందిన 2వేల 8వందల కోట్ల విలువైన షేర్లను కార్వీ తాకట్టు పెట్టి బ్యాంక్ లోన్ తీసుకున్నట్టు ఈడీ గుర్తించింది. సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటివరకు 2 వేల 95 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.