EAMCET 2020: ఎంసెట్ అభ్య‌ర్థుల‌కు ముఖ్య గ‌మ‌నిక.. షెడ్యూల్ స్వ‌ల్ప‌ మార్పులు

EAMCET 2020: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం విద్యారంగంపై అధికంగానే ప‌డింద‌ని చెప్పాలి. వైర‌స్ తీవ్రత‌తో అనేక ప‌రీక్ష‌లు వాయిదా వేసిన విష‌యం తెలిసిందే. అయితే ఎట్ట‌కేల‌కు తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాలు ఎంసెట్ ప‌రీక్షను నిర్వ‌హించేందుకు షెడ్యూల్ ప్ర‌క‌టించాయి.

Update: 2020-08-26 16:09 GMT

EAMCET 2020

EAMCET 2020: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం విద్యారంగంపై అధికంగానే ప‌డింద‌ని చెప్పాలి. వైర‌స్ తీవ్రత‌తో అనేక ప‌రీక్ష‌లు వాయిదా వేసిన విష‌యం తెలిసిందే. అయితే ఎట్ట‌కేల‌కు తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాలు ఎంసెట్ ప‌రీక్షను నిర్వ‌హించేందుకు షెడ్యూల్ ప్ర‌క‌టించాయి. తెలంగాణలో సెప్టెంబర్ 9 నుంచి, ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 17 నుంచి ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. కానీ కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించే టైమింగ్స్ మాత్రం కొంచెం మార్పులు ఉండనున్నాయి.

తెలంగాణలో సెప్టెంబర్ 9, 10, 11, 14, 28, 29 తేదీల్లో, ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 17, 18, 21, 22, 23, 24, 25 తేదీల్లో ఎంసెట్ ఎగ్జామ్స్ ఉంటాయి. సాధారణంగా ఈ ప‌రీక్ష‌ల‌ను రెండు సెష‌న్‌ల్లో నిర్వ‌హిస్తారు.  ఉదయం సెషన్ 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం సెషన్ 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయి.

కానీ  కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఉదయం, మధ్యాహ్నం సెషన్ల మధ్య ఎక్కువ సమయం  ఉండేలా ప్లాన్ చేశారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు పరీక్షా కేంద్రంలో శానిటైజేషన్ చేస్తారు. కాబట్టి విద్యార్థులు ఈ పరీక్ష వేళల్ని దృష్టిలో పెట్టుకోవాలి.

టైమింగ్స్‌లో మార్పులతో పాటు పరీక్షా కేంద్రం దగ్గర అనేక జాగ్రత్తలు తీసుకోనున్నారు. పరీక్షకు వచ్చే విద్యార్థులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. పరీక్షా కేంద్రాల దగ్గర సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేలా చర్యలు తీసుకుంటారు. శానిటైజర్, హ్యాండ్ వాష్ అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు పరీక్షా కేంద్రాల లోపలికి వచ్చేముందే థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలు ఉంటే ఐసోలేషన్ కేంద్రానికి తరలిస్తారు. కరోనా లక్షణాలు ఉన్న విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ఐసోలేషన్ కేంద్రంలోనే వాళ్లు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఐసోలేషన్ కేంద్రంలో పనిచేసే ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్స్ అందజేస్తారు.  పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్స్‌: https://eamcet.tsche.ac.in, https://sche.ap.gov.in  సంప్రదించండి. 

Tags:    

Similar News