Telangana: ఈ-గోల్కొండ పోర్టల్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
Telangana: తెలంగాణ చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ గోల్కొండ ఫ్లాట్ ఫాం (పోర్టల్)ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష‌్కరించారు.
Telangana: తెలంగాణ చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ గోల్కొండ ఫ్లాట్ ఫాం (పోర్టల్)ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష‌్కరించారు. తెలంగాణ రాష్ట్ర హ్యాండిక్రాప్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈ పోర్టల్‌ను రూపొందిచింది. ఇందులో అద్భుతమైన సాంప్రదాయ కళాకృతులను, చేతి బొమ్మలను కొనుగోలు చేసే వీలుంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు.
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి చేనేత, జౌళిశాఖలో ఓ విభాగమైన హ్యాండీక్రాఫ్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను బలోపేతం చేస్తూ వస్తున్నట్లు చెప్పారు. అనేక అద్భుతమైన ఉత్పత్తులకు ప్రపంచస్థాయి ఈ-మార్కెట్ ప్లేస్‌ని తయారు చేయడమే లక్ష్యంగా పోర్టల్‌ను రూపొందించినట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్న అనేక ప్రైవేటు ఈ-కామర్స్ వెబ్‌సైట్ల కంటే అత్యుత్తమంగా ఈ వెబ్ పోర్టల్‌లో సౌకర్యాలు కల్పించామన్నారు.