Durgam Cheruvu Cable Bridge: ప్రారంభమైన దుర్గంచెరువు 'కేబుల్, బ్రిడ్జి...
Durgam Cheruvu Cable Bridge | పదేపదే వాయిదా పడుతున్న హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఎట్టకేలకు ప్రారంభమైంది.
Durgam Cheruvu Cable Bridge | పదేపదే వాయిదా పడుతున్న హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఎట్టకేలకు ప్రారంభమైంది. కేంద్ర హోం సహాయక మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ సోమేశ్ కుమార్ కలిసి నేడు బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో హైదరాబాద్‌కు ప్రత్యేక ఆకర్షణతోపాటు మాదాపూర్, జూబ్లీహిల్స్ మధ్య ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గనున్నాయి. దుర్గంచెరువుపై నిర్మించిన ఈ వంతెన దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా రూపుదిద్దుకుంది. ఎల్‌ఈడీ లైట్ల వెలుగుల్లో వంతెన అందాలు కనువిందు చేస్తున్నాయి.
మాదాపూర్ వద్ద దుర్గం చెరువుపై రూ.184 కోట్ల వ్యయంతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జి. అటు జుబ్లీ హిల్స్ రోడ్ నం. 45ను కలుపుతూ నిర్మించిన వంతెనకు 'పెద్దమ్మతల్లి ఎక్స్ ప్రెస్‌వే'గా పేరు పెట్టారు. అయితే, ఈ కేబుల్ వంతెన ప్రారంభించడం ద్వారా చాలా మంది ప్రయాణికులకు కొన్ని కిలో మీటర్ల దూరం ప్రయాణ భారం తగ్గుతుంది. అంతే కాదు శని, ఆదివారాల్లో ఈ కేబుల్ వంతెన పైకి వాహనాలు అనుమతి చేయకుండా కేవలం సందర్శనకు మాత్రమే అనుమతులు ఇవ్వనున్నారు అధికారులు. ఈ కేబుల్ వంతెనను సందర్శనకు వచ్చిన వారి వాహనాలు పార్కింగ్ చేయడానికి కూడా స్థలాన్ని ఏర్పాటు చేసారు.