దుబ్బాక టీఆర్‌ఎస్ అభ్యర్థి పేరు ఖరారు చేసిన సీఎం కేసీఆర్

Update: 2020-10-06 04:50 GMT

తెలంగాణలో రాజకీయాలు ఊపందుకున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో ప్రచార పర్వం మొదలయింది. నవంబర్ 3న దుబ్బాక ఎలక్షన్స్ నవంబర్ 10వ తేదీన కౌంటింగ్ ఫలితాలు వస్తాయి. దుబ్బాక ఉప ఎన్నికను టీఆర్‌ఎస్‌ సీరియస్‌గా తీసుకుంది. గత ఆగస్టులో టీఆర్‌ఎస్‌ సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చనిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమయింది. ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ముందుకు వెళుతోంది. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాతను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఖరారుచేశారు.

సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు. ఉద్యమం కోసం, పార్టీ కోసం అంకితభావంతో పని చేశారు. దుబ్బాక నియోజకవర్గ అభివద్ధి కోసం చివరిశ్వాస వరకు శ్రమించారు. ఆయన కుటుంబమంతా ఇందులో పాలుపంచుకుంది. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలతో ఆ కుటుంబానికి అనుబంధం ఉంది. రామలింగారెడ్డి తలపెట్టిన అభివృద్ధిని కొనసాగడం కోసం ఆయన కుటుంబ సభ్యులే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం సమంజసం. జిల్లాలోని నాయకులందరితో సంప్రదింపులు జరిపాకే సుజాత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశాం అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

సుజాత బయోడాటా

పేరు: సోలిపేట సుజాత

భర్త: సోలిపేట రామలింగారెడ్డి (దివంగత దుబ్బాక ఎమ్మెల్యే)

పుట్టిన తేదీ: 01-01-1969

వివాహం: 26-12-1986, విద్యార్హత: 5వ తరగతి

తల్లిదండ్రులు: లక్కిరెడ్డి రుక్కమ్మ-రాఘవరెడ్డి

కొడుకు: సోలిపేట సతీష్‌రెడ్డి, కూతురు: ఉదయశ్రీ




 


Tags:    

Similar News