దుబ్బాక ఓట్ల లెక్కింపు.. క్షణ క్షణం..టెన్షన్ భరితం!
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు క్షణక్షణం ఉత్కంఠ రేపాయి. నువ్వా..నేనా అన్నట్టుగా ఓట్ల లెక్కింపు సాగింది. రాజకీయ పార్టీలతో పాటు ప్రజల్లో ఆసక్తిని రేపాయి
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు క్షణక్షణం ఉత్కంఠ రేపాయి. నువ్వా..నేనా అన్నట్టుగా ఓట్ల లెక్కింపు సాగింది. రాజకీయ పార్టీలతో పాటు ప్రజల్లో ఆసక్తిని రేపాయి. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతపై బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 1079 స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రిటర్నింగ్ అధికారి గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 63 వేల 352 ఓట్లు రాగా టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు 62 వేల 273, కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి 22,196 ఓట్లు వచ్చాయి.
మొదటి రౌండ్ నుంచి 5 రౌండ్ల వరకు బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు ఆధిక్యం చూపారు. 6, 7వ రౌండ్లలో టీఆర్‌ఎస్ అభ్యర్ధి సోలిపేట సుజాత ఆధిక్యతను కనబర్చింది. బీజేపీ, టీఆర్‌ఎస్ అభ్యర్థుల మధ్య స్వల్ప ఓట్ల తేడా ఉండడంతో చివరి వరకూ టెన్షన్‌కు గురిచేశాయి. 8, 9వ రౌండ్లలో బీజేపీ, 10వ రౌండ్‌లో టీఆర్‌ఎస్, 11వ రౌండ్‌లో బీజేపీ, 12వ రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యత కనబర్చాయి. 13, 14, 15, 16, 17, 18, 19 రౌండ్లలో వరుసగా టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ఆధిక్యత చాటగా.. 20, 21, 22, 23 రౌండ్లలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఆధిక్యం కనబర్చారు.
బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావుకు మొత్తంగా 38.47 శాతం ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్ధి సుజాత 37.82 శాతం ఓట్లతో రెండస్థానంలో నిలువగా కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాసరెడ్డి 23.31 శాతం ఓట్లతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు
రౌండ్ల వారీగా కౌంటింగ్ ఫలితాలు
1వ రౌండ్
బీజేపీ-3208, టీఆర్ఎస్-2,867 కాంగ్రెస్-648 ఓట్లు
2వ రౌండ్
బీజేపీకి 3,284, టీఆర్ఎస్-2,490, కాంగ్రెస్-667 ఓట్లు
3వ రౌండ్
టీఆర్ఎస్ 2,607,బీజేపీ 2,731, కాంగ్రెస్- 616 ఓట్లు
4వ రౌండ్
బీజేపీకి 3,832, టీఆర్ఎస్‌కు 2,407, కాంగ్రెస్‌కు 227 ఓట్లు
5వ రౌండ్
బీజేపీ 3,462, టీఆర్ఎస్ 3,126, కాంగ్రెస్-566 ఓట్లు
6వ రౌండ్
టీఆర్ఎస్-4,062, బీజేపీ-3,709, కాంగ్రెస్-530 ఓట్లు
7వ రౌండ్
టీఆర్ఎస్-2,718, బీజేపీ- 2,536, కాంగ్రెస్-749 ఓట్లు
8వ రౌండ్
బీజేపీ-3,116, టీఆర్ఎస్-2,495, కాంగ్రెస్-1,122 ఓట్లు
9వ రౌండ్
బీజేపీ-3,413, టీఆర్ఎస్-2,329, కాంగ్రెస్- 675 ఓట్లు
10వ రౌండ్
టీఆర్ఎస్-2,948, బీజేపీ-2,492, కాంగ్రెస్- 899 ఓట్లు
11వ రౌండ్
బీజేపీ 2,965, టీఆర్ఎస్ 2,766, కాంగ్రెస్ 1,883 ఓట్లు దక్కించుకున్నాయి.
12వ రౌండ్
బీజేపీ-1,997, టీఆర్ఎస్-1900, కాంగ్రెస్- 2,080 ఓట్లు
13వ రౌండ్
టీఆర్ఎస్-2,824 , బీజేపీ-2,520 ,కాంగ్రెస్‌కు 1,212 ఓట్లు
14వ రౌండ్
టీఆర్ఎస్ 2,537, బీజేపీ 2,249, కాంగ్రెస్- 784 ఓట్లు
15వ రౌండ్
టీఆర్ఎస్-3,027, బీజేపీ-2,072, కాంగ్రెస్-1,500 ఓట్లు
16వ రౌండ్
టీఆర్ఎస్ 3,157, బీజేపీ 2,408, కాంగ్రెస్-674 ఓట్లు
17వ రౌండ్
టీఆర్ఎస్ 2818, భజాపా1946, కాంగ్రెస్-1705 ఓట్లు
18వ రౌండ్
టీఆర్ఎస్-3215, బీజేపీ-2527, కాంగ్రెస్- 852 ఓట్లు
19వ రౌండ్
టీఆర్ఎస్-2,750, బీజేపీ-2,335, కాంగ్రెస్-976 ఓట్లు
20వ రౌండ్
బీజేపీ-2931 టీఆర్ఎస్-2440, కాంగ్రెస్ 1058
21వ రౌండ్
బీజేపీ-2428, టీఆర్ఎస్-2048 కాంగ్రెస్-845
22వ రౌండ్
బీజేపీ-2958, టీఆర్ఎస్-2520, కాంగ్రెస్-971
23వ రౌండ్
బీజేపీ-1653 టీఆర్ఎస్-1241,కాంగ్రెస్-580
24వ రౌండ్
బీజేపీ-133 టీఆర్ఎస్ 142, కాంగ్రెస్-89
25వ రౌండ్
బీజేపీ-79, టీఆర్ఎస్-109 కాంగ్రెస్౧౪౬
పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు
టీఆర్ఎస్-720
బీజేపీ-368
కాంగ్రెస్ 142
అభ్యర్థుల వారీగా ఓట్లిలా..
రఘునందన్ రావు( బీజేపీ)- 63,352
సోలిపేట సుజాత( టీఆర్ఎస్)-62,273
చెరుకు శ్రీనివాసరెడ్డి( కాంగ్రెస్)- 22.196