ఈ విజయం దుబ్బాక ప్రజలది : రఘునందన్ రావు
ఉప ఎన్నికలో తనను గెలిపించిన దుబ్బాక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు రఘునందన్ రావు. దుబ్బాక తీర్పు పాలకులకు కనువిప్పు కలిగించాలన్నారు.
ఉప ఎన్నికలో తనను గెలిపించిన దుబ్బాక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు రఘునందన్ రావు. దుబ్బాక తీర్పు పాలకులకు కనువిప్పు కలిగించాలన్నారు. ఈ విజయం దుబ్బాక ప్రజలదని.. తన శేష జీవితం దుబ్బాకకు అంకితం చేస్తానని రఘునందన్ రావు అన్నారు.. ఇక ఈ రోజు వెలువడిన ఫలితాల్లో రఘునందన్ రావు సంచలన విజయం సాధించి మొదటిసారి దుబ్బాకలో విజయకేతనం ఎగురవేశారు.. 14వందల ఓట్లకు పైగా తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత పైన విజయం సాధించారు. మొత్తం 23 రౌండ్లలలో సాగిన లెక్కింపులలో రఘునందన్ రావు కు 62,772 ఓట్లు రాగా, సోలిపేట సుజాతకి 61,302 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 21,819 ఓట్లు వచ్చాయి.. ఓట్ల శాతంగా చూసుకుంటే.. బీజేపీకి 39%, టీఆర్ఎస్ కి 37% ఓట్లు వచ్చాయి.