Dubaka elections: దుబ్బాక ఎన్నికల ప్రచారం నేటితో పూర్తి!
Dubaka elections: అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న దుబ్బాక ఎన్నికల ప్రచారం నేటితో పూర్తి కానుంది.
Dubaka elections | అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న దుబ్బాక ఎన్నికల ప్రచారం నేటితో పూర్తి కానుంది. హోరా హోరీగా సాగిన ఎన్నికల ప్రచారంలో అన్ని ప్రధాన పార్టీలు నువ్వా..నేనా అన్నట్టు పోటీ పడ్డాయి. ఇప్పటివరకూ అన్ని పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఈ సాయంత్రంతో ప్రచార హోరుకు తేరా పడనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది.
ఇక దుబ్బాకలో ఈనెల 3న ఉపఎన్నిక పోలింగ్ జరుగనుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. దీంతో అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా రంగంలోకి దిగాయి. టీఆర్ఎస్ పార్టీ తరఫున దివంగత రామలింగారెడ్డి సతీమణి సుజాత పోటీలో ఉన్నారు. ఆమె గెలుపు బాధ్యతను మంత్రి హరీశ్‌రావు తన భుజానవేసుకున్నారు.
పోలింగ్ కు ఇక రెండు రోజులే ఉండడంతో అధియార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమయింది. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నెలరోజులపాటు పోలీస్ యాక్ట్-1861ను అమలు చేయనున్నారు. ప్రచారం ముగియగానే స్థానికేతరులు వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీచేశారు.