Happy Diwali 2021: దీపావళి శోభను సంతరించుకున్న భాగ్యనగరం
Happy Diwali 2021 - Hyderabad: టపాసుల తర్వాత మిఠాయిల కొనుగోళ్లకు గిరాకీ...
Happy Diwali 2021 - Hyderabad: హైదరాబాద్ సిటీలో నగరంలో దీపావళి శోభ సంతరించుకుంది. గత ఏడాది కోవిడ్ కారణంగా పండుగ సంబరాలకు దూరంగా ఉన్న వారంతా..ఈ ఏడాది ఘనంగా జరుపుకుంటున్నారు. దీపావాళి అంటేనే అందరికీ వెంటనే గుర్తొచ్చేది టపాసుల తర్వాత మిఠాయిలే.. ప్రతి ఇంట్లో జరిగే వేడుక మొదలుకొన కార్పొరేట్ కార్యాలయాల వరకు మిఠాయిలు పంచుకోవడం సంప్రదాయంగా వస్తోంది. దీంతో ఆఫ్ లైన్..ఆన్ లైన్ లోనూ ఆర్డర్లు జోరందుకున్నాయి.
దీపావళి పండుగతో మిఠాయిలకు ఫుల్ గిరాకీ పెరిగింది. గత ఏడాది తో పోలిస్తే ఈ ఎడది ధరలు కాస్త పెరిగాయని కొనుగోలు దారులు చెబుతున్నారు. ధరలు ఎంతైనా ఎవరి స్థాయిలో వారు కొనుగోలు చేసేందుకు వెనకాడటం లేదు. మరోవైపు వ్యాపారులు.. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు సంప్రదాయ మిఠాయిలతో పాటు ప్రత్యేకత కల్గిన మిఠాయిలను అందుబాటులో ఉంచారు.
కొనుగోలు దారులు కష్టమర్స్ ను ఆకర్షించేందుకు వెరైటీ మిఠాయిలు అందుబాటులోకి తీసుకు వచ్చారు వ్యాపారులు. కాజు కట్లీ, రస్‌మలై, గులాబ్ జామూన్, మైసూర్ పాక్, ఖీర్, బర్ఫీ, లడ్డూలు తదితర స్వీట్లతో పాటు నెయ్యి, డ్రైఫ్రూట్స్, కుంకుమపువ్వుతో ఉన్న మిఠాయిలు ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధపెట్టేవారు డ్రైఫ్రూట్ మిఠాయిల వైపు మొగ్గు చూపుతున్నారు. టపాసులు కాల్చడంతో వాతావరణ కాలుష్యం అవుతుందని వాటి కొనుగోళ్లు తగ్గించి స్వీట్స్ కొనుగోళ్లు చేస్తున్నామని నగరవాసులు చెబుతున్నారు.