Nizamabad: రెడ్ జోన్ ఏరియాలో పరిస్థితి స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్
నిజామాబాద్: నగరంలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ కార్తికేయ, మున్సిపల్ కమిషనర్ జితేష్ పాటిల్ పర్యటన చేసారు. బైక్ నడుపుతూ.. రెడ్ జోన్ ఏరియాలో పరిస్థితి స్వయంగా పరిశీలించిన అధికారులు. ఖిల్లా రోడ్, బర్కత్ పురా, మలా పల్లి, ప్రాంతాల్లో పర్యటన చేసారు.
ప్రైమరీ కాంటాక్టు కు మొదటి పరీక్షలో నెగెటివ్ వస్తే.. 14 రోజుల తర్వాత మళ్ళీ పరీక్ష. కారోనా వైరస్ వ్యాప్తి అడ్డుకునేందుకు లాక్ డౌన్ పొడిగింపు చేసారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని బహిరంగ ప్రదేశాల్లో అమ్మితే జరిమానాలు తప్పవని కలెక్టర్ నారాయణ రెడ్డి హెచ్చరించారు.