Telangana: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో ఇవాళ్టి నుంచి డిజిటల్ పాఠాలు
Telangana: టీ-శాట్ ద్వారా ఈ నెల 8 వరకు పాఠాలు
Telangana: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇవాళ్టి నుంచి డిజిటల్ పాఠాలను ప్రసారం చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. టీ-శాట్ ద్వారా ఈ నెల 8 వరకు పాఠాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందిని విద్యాశాఖ ఆదేశించింది. కొవిడ్ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా తగ్గినట్లు సమాచారం. దీనికి తోడు ఆన్‌లైన్ క్లాసులు కూడా అందుబాటులో ఉంచాలని హైకోర్టు కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ.. డిజిటల్ క్లాసులను అందుబాటులోకి తెచ్చింది.