Dharani Portal: ధరణి మార్గదర్శకాలు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం

Dharani Portal: మార్చి 1 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు

Update: 2024-02-29 09:58 GMT

Dharani Portal: ధరణి మార్గదర్శకాలు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం

Dharani Portal: ధరణి సమస్యల పరిష్కారానికి గైడ్‌లైన్స్‌ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. కలెక్టర్లకు గైడ్‌లైన్స్‌ జారీ చేసింది C.C.L.A. మార్చి 1 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 24న ధరణిపై సీఎం చేసిన సమీక్షలో.. ధరణి దరఖాస్తులను వెంటనే క్లియర్‌ చేయాలని ఆదేశించారు.

తహశీల్దార్‌, ఆర్డీవో, అడిషనల్‌ కలెక్టర్లు, కలెక్టర్ల సమక్షంలో కమిటీలు వేయనున్నారు. నిర్ణీత సమయంలో పెండింగ్‌ దరఖాస్తులు క్లియర్‌ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఆధార్‌ నెంబర్‌ మిస్‌ మ్యాచ్‌, రైతుల పేర్లు తప్పుగా ప్రచురించబడి ఆగిపోయిన దరఖాస్తులు, ఫొటో మిస్‌ మ్యాచ్‌ వంటి పెండింగ్‌ అప్లికేషన్లను సత్వరమే పరిష్కరించాలని, సరిచేసిన దరఖాస్తుల వివరాలు ఆన్‌లైన్‌ చేయాలని సూచించారు. ప్రభుత్వ భూములపై కఠినంగా వ్యవహరించాలని, అసైన్డ్‌ భూముల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి.

Tags:    

Similar News