DGP Mahender Reddy Tour : ఆసిఫాబాద్ జిల్లాలో ముగిసిన డీజీపీ పర్యటన
DGP Mahender Reddy Tour : ఈ నెల 2వ తేదీన ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు డీజీపీ మహేందర్‌రెడ్డి వెళ్లిన విషయం తెలిసిందే.
DGP Mahender Reddy Tour : ఈ నెల 2వ తేదీన ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు డీజీపీ మహేందర్‌రెడ్డి వెళ్లిన విషయం తెలిసిందే.కాగా గత మూడు రోజుల నుంచి జిల్లాలో మావోయిస్టుల కదలికలను పూర్తిస్థాయిలో కట్టడిచేసేందుకు డీజీపీ విస్తృతంగా చర్చించారు. అనంతరం పోలీసులకు మార్గనిర్దేశం చేశారు. మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించిన డీజీపీ ఆదివారం హైదరాబాద్‌కు తిరిగి బయల్దేరారు. గత మూడు రోజుల నుంచి ఆసిఫాబాద్ జిల్లాలోనే మకాం వేసిన ఆయన మావోయిస్టుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చలు కూడా జరిపారు.
సెప్టెంబర్ 2వ తేదీన ఆసిఫాబాద్ జిల్లా, మహారాష్ర్ట సరిహద్దుల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. శుక్రవారం రాత్రి తిర్యాణి పోలీసు స్టేషన్‌ను డీజీపీ సందర్శించారు. గురు, శుక్రవారాల్లో జిల్లా పోలీసు అధికారులతో సమీక్షించారు. తిర్యాణి అటవీ ప్రాంతం కాబట్టి మావోయిస్టుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై తిర్యాణి పోలీసు స్టేషన్ సిబ్బందికి డీజీపీ మార్గనిర్దేశం చేశారు. శనివారం కూడా జిల్లా స్థాయి పోలీసు అధికారులతో మారమూల అటవీ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలపై చర్చించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన పోలీసులకు పలు సూచనలు చేశారు. అటవీ ప్రాంతాల్లో పోలీసులు తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ చర్చించి దిశానిర్దేశం చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ల నుంచి 11 మంది సభ్యులతో కూడిన బృందం మార్చిలో వచ్చినట్లు సమాచారం. రెండు నెలలుగా జిల్లాలో సంచరిస్తున్న ఐదుగురు సభ్యులతో కూడిన మైలారపు అడెళ్లు అలియాస్ భాస్కర్ బృందాన్ని కట్టడి చేసేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు డీజీపీ రెండు రోజులుగా జిల్లాలోని ఉన్నతస్థాయి అధికారులతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.