Devotees Must Bring Umbrella: గొడుగుంటేనే దర్శనం.. పెద్దమ్మ తల్లి ఆలయంలో నిబంధన

Update: 2020-08-03 03:03 GMT

devotees must bring umbrella: కరోనా వైరస్ విలయాన్ని అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు... ఇంటి వైద్యం దగ్గర్నుంచి బయటకు వెళితే భౌతిక దూరం పాటింపు, మాస్క్ ధరించడం వంటివి తప్పకుండా చేయాల్సి వస్తోంది. అయితే ఈ విధంగా చేస్తున్న ఇద్దరి మధ్యా ఎటువంటి అడ్డు లేకపోవడంతో ఒక్కోసారి కలుసుకునే అవకాశం వస్తోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు గొడుగు నిబంధనను అమల్లోకి తెచ్చారు. దీనిని విప్పి ఉంచడం వల్ల ఆటోమెటిక్ గా భౌతిక దూరం తప్పనిసరి అవుతుందనే కారణంతో ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. దీనిని ప్రస్తుతం తెలంగాణాలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో అమలు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ మ‌హ‌మ్మారి విస్తృతంగా విజృంభిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అందులోనూ హైదరాబాద్ న‌గ‌రంలో రోజు రోజుకీ క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఇక ఈ నేప‌థ్యంలోనే జూన్ వ‌ర‌కు దేవాల‌యంలో భ‌క్తుల అనుమ‌తిని నిరాక‌రించాయి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు. అయితే కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సూచ‌న‌ల‌తో దేవాల‌యాలు తెరుచుకున్నాక భ‌క్తుల‌ను అనుమ‌తిస్తున్నారు. మాస్క్ ధ‌రించాల‌ని, సోష‌ల్ డిస్టెన్స్ పాటించాల‌ని చెప్తూ స‌ర్కిల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు ఆల‌య నిర్వాహ‌కులు.

ఈ నేప‌థ్యంలో క‌రోనాతో భ‌క్తులు ఇబ్బంది ప‌డ‌కుండా ఉండేందుకు కీలక నిర్ణ‌యం తీసుకున్నారు పెద్ద‌మ్మ త‌ల్లి గుడి ఆల‌య నిర్వాహ‌కులు. ద‌ర్శ‌నం చేసుకోవాలి అంటే త‌ప్ప‌నిస‌రిగా గొడుకు ఉండాల‌నే నిబంధ‌న‌ల‌ను తీసుకొచ్చారు. ఆల‌యంలో లోప‌ల అడుగు పెట్టిన భ‌క్తులు త‌ప్ప‌నిస‌రిగా గొడుగు ఓపెన్ చేసుకుని ఉంచాలి. ద‌ర్శ‌నం పూర్తి చేసుకుని బ‌య‌ట‌కు వెళ్లే వ‌ర‌కూ గొడుగు మూయ‌కూడ‌దు. భ‌క్తులు భౌతిక దూరం పాటించ‌ని కార‌ణంతో.. ఆల‌య నిర్వ‌హ‌కులు ఈ రూల్‌ని తీసుకొచ్చారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా అందరూ విధిగా గొడుగు తెచ్చుకునే అలవాటు లేకపోవడం వల్ల వీటికి డిమాండ్ పెరుగుతోంది. వీటిని అలయం ఎదుట అద్దె ప్రాతిపదికన ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే విధంగా ఏపీ ప్రభుత్వం సైతం వైన్ షాపుల వద్ద గొడుగు తప్పనిసరి చేయడంతో ఇదే విదంగా వ్యాపారం చేశారు. గొడుక్కి పది రూపాయల చొప్పున వసూలు చేసేవారు.

Tags:    

Similar News