Medaram Jatara: మేడారం సమ్మక్కకు ముందస్తు మొక్కులు
Medaram Jatara: ఆదివారం భారీగా తరలివచ్చిన భక్తులు
Medaram Jatara: మేడారం సమ్మక్క జాతరకు భక్తులు ముందస్తు మొక్కులు చెల్లిస్తున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు భారీగా మేడారం తరలివచ్చారు. అడవి తల్లుల దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి, తలనీలాలు సమర్పించి అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుంటున్నారు. వనదేవతలకు ఎత్తు బెల్లం సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతర ఉత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఏటా కోటిన్నర మంది భక్తులు సమ్మక్క తల్లికి మొక్కులు చెల్లిస్తారు. ఈ మేరకు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.