డ్రగ్స్ డిస్ట్రక్షన్ డే సందర్భంగా మత్తు పదార్థాల ధ్వంసం

*దేశ వ్యాప్తంగా 42వేల కేజీల మత్తు పదార్థాలు ధ్వంసం

Update: 2022-06-09 04:16 GMT

డ్రగ్స్ డిస్ట్రక్షన్ డే సందర్భంగా మత్తు పదార్థాల ధ్వంసం 

Drugs Destruction Day: డ్రగ్‌ డిస్ట్రక్షన్‌ డే సందర్భంగా రూ.150 కోట్ల విలువ చేసే మత్తు పదార్థాలను కస్టమ్స్‌ అధికారులు దహనం చేశారు. తెలంగాణ కస్టమ్స్‌, సెంట్రల్‌ ట్యాక్స్‌ చీఫ్‌ కమిషనర్‌ బీవీ సివంగకుమారి, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారుల సమక్షంలో దుండిగల్‌లోని హైదరాబాద్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టు ఆవరణలో డ్రగ్స్‌ను కాల్చి వేశారు. రెండేండ్లలో డీఆర్‌ఐ హైదరాబాద్‌ జోనల్‌ యూనిట్‌ అధికారులు ఎయిర్‌పోర్టులు, ఇతర ప్రాంతాల్లో 20.35 కిలోల హెరాయిన్‌, 4,812 కిలోల గంజాయి సహా ఇతర మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

రెండేళ్లుగా థాయ్‌లాండ్, ఉగాండా, జింబా బ్వే, టాంజానియా, జాంబియా దేశాల నుంచి హైదరాబాద్‌కు రవాణా చేస్తున్న మాదక ద్రవ్యాలను హైదరాబాద్‌ విమానాశ్రయంలో డీఆర్‌ఐ సిబ్బంది పట్టుకున్నారు. ఇందులో 35 కేజీల హెరాయిన్, కొకైన్‌ ఉన్నాయి. హెరాయిన్‌ విలువ రూ.142 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. సిద్ధిపేట, ఎల్‌బీ నగర్, పెద్ద అంబర్‌ పేట తదితర ప్రాంతాల్లో 4,821 కిలోల గంజాయిని పట్టుకున్నట్టు, దీని విలువ రూ.9.62 కోట్లు ఉంటుందని వివరించారు.

Tags:    

Similar News