ఐదు రోజలుగా మంచినీటి ట్యాంకులో మృతదేహం.. అదే ట్యాంక్‌లో నీళ్లు తాగిన స్థానిక ప్రజలు
Musheerabad: హత్య చేసి వాటర్ ట్యాంక్‌లో పడేశారా? లేక ప్రమాదవశాత్తు పడ్డాడా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు
Musheerabad: మంచి నీటి ట్యాంకులో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం కనిపించడం నగరంలో కలకం రేపింది. నిన్న ముషీరాబాద్‌లోని రాంనగర్ రీసాలగడ్డ వాటర్ ట్యాంక్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వాటర్ ట్యాంక్‌ను శుభ్రపరిచేందుకు వెళ్లిన వాటర్ వర్స్క్ సిబ్బందికి మంచినీటి ట్యాంకులో మృతదేహం కనిపించింది.
వెంటనే పోలీసులకు సమాచారం అందిచారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా హత్య చేసి వాటర్ ట్యాంక్‌లో పడేశారా? లేక ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంక్‌లో పడి మృతిచెందాడ అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
వాటర్ ట్యాంక్‌లో మృతదేహం దాదాపు ఐదు రోజులకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ వాటర్ ట్యాంక్ నుంచి నీళ్లను తాగిన తమ పరిస్థితి ఏంటని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తమకు వెంటనే మంచి నీటి ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేయాలని డిమాండ్ చేస్తున్నారు.