వారంతా అందమైన యువతులు.. కవ్వించే మాటలు వారివి, డేటింగ్, చాటింగ్ అంటూ రెచ్చగొడతారు. చిలిపి చేష్టలతో ముగ్గులోకి దించుతారు, కిక్కెకించే ఈ అందాలు మీ కోసం అంటూ ఆఫర్లు సైతం ఇస్తారు. ఇక ఆ మాయ మాటలకు లొంగితే అంతే అందినకాడికి దోచుకుని హ్యాండ్ ఇస్తారు. ఆన్‌లైన్ డేటింగ్ పేరుతో నయా మోసాలకు పాల్పడుతున్న డేటింగ్ డేంజర్‌పై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్.
నగరంలో నానాటికీ మోసాలు పెరిగిపోతున్నాయి. అక్రమంగా డబ్బులు సంపాదించే కేటుగాళ్లు అమ్మాయిలను ఎరగా వేసి యువకులను బోల్తా కొట్టిస్తున్నారు. చాటింగ్, ఆన్ లైన్ డేటింగ్ అంటూ యంగ్ స్టర్స్‌కు అందమైన యువతులను ఎరగా వేసి ముగ్గులోకి దించుతారు ఈ కేటుగాళ్లు. అమ్మాయిలను హైర్ చేసి వారితో చాటింగ్‌లు చేయిస్తారు. ఆ తర్వాత అందాలు ఆరబోసి యువతను కవ్వించే పనిలో పడతారు యువతులు.
ఇక అబ్బాయిలు కాస్త లొంగారని తెలియగానే డబ్బులు దండుకోవటం మొదలు పెడతారు. రిజిస్ట్రేషన్ కు కొంత డబ్బు అవుతుతందని అది కడితే డైరెక్ట్ గా కలిసే అవకాశం ఉంటుందని రెచ్చగొడుతారు. ఒక్కసారి అట్రాక్ట్ అయితే యంగ్ స్టర్స్ కూడా వారు అడిగిన విధంగా డబ్బులు పంపుతారు. మళ్లీ కొన్ని రోజుల తర్వాత సేమ్ సీన్ రిపీట్ చాటింగ్ చేసి మరికొన్ని డబ్బులు అడుగుతారు. నిలదీస్తే ఫోన్లు స్విఛాఫ్ చేసుకుంటారు. ఇలా పెద్ద మొత్తంలో నష్టపోయిన వారు ఎవ్వరికీ చెప్పుకోలేక తలలు పట్టుకుంటున్నారు.
కోల్ కతా కేంద్రంగా ఈ వ్యవహారం నడుస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. విశాలమైన భవనాల్ని ఆఫీస్‌లుగా పెట్టి అందమైన అమ్మాయిలను ఉద్యోగులుగా చేర్చుకుని ఈ దందా నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. తమ కాల్స్ కానీ ఇతర ప్రాసెస్ లను కానీ గుర్తించలేని విధంగా జాగ్రత్తలు తీసుకుంటుడటంతో వారితో కేర్‌ఫుల్‌గా ఉండాలంటున్నారు సైబర్ నిపుణులు.