స్కూళ్లకు దసరా సెలవులు తగ్గింపు..? 9 రోజులే సెలవులు ఇవ్వాలని.. ఎస్‌సీఈఆర్‌టీ కీలక ప్రతిపాదనలు..

స్కూళ్లకు దసరా సెలవులు తగ్గింపు..? 9 రోజులే సెలవులు ఇవ్వాలని.. ఎస్‌సీఈఆర్‌టీ కీలక ప్రతిపాదనలు..

Update: 2022-09-21 07:38 GMT

స్కూళ్లకు దసరా సెలవులు తగ్గింపు..? 9 రోజులే సెలవులు ఇవ్వాలని.. ఎస్‌సీఈఆర్‌టీ కీలక ప్రతిపాదనలు..

Dussehra Holiday 2022: తెలంగాణలో స్కూళ్లకు దసరా సెలవులు తగ్గించడం లేదా రెండో శనివారాల్లోనూ పాఠశాలలను నడిపేందుకు అనుమతించాలని కోరుతూ ఎస్‌సీఈఆర్‌టీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) డైరెక్టర్‌ ఎం రాధారెడ్డి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేనకు మంగళవారం లేఖరాశారు. దసరాకు 14 రోజులకు బదులుగా తొమ్మిది రోజులే సెలవులు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖకు సూచించినట్టు తెలుస్తోంది.

జూలైలో వర్షాలు, సెప్టెంబర్‌ 17న పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ఏడు రోజులు పనిదినాలు తగ్గాయని.. దీంతో ఆ సెలవు దినాలను భర్తీ చేసేందుకు ఎస్‌సీఈఆర్‌టీ ఈ ప్రతిపాదన పాఠశాల విద్యాశాఖ ముందు ఉంచింది. అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం మొత్తం పని దినాలు 230 కాగా, జరిగిన నష్టాన్ని పూరించేందుకు పై రెండు ప్రతిపాదనలను సమర్పించారు. ఎస్‌సీఈఆర్‌టీ ప్రతిపాదనను పాఠశాల విద్యాశాఖ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఈ నెల 26 నుంచి అక్టోబర్‌ 9వరకు దసరా సెలవులు ఇస్తున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News