CP Avinash Mahanthi: న్యూఇయర్ వేడుకలపై టీఎస్ పోలీసుల ఆంక్షలు
CP Avinash Mahanthi: న్యూఇయర్ ఈవెంట్లకు ఎవరైనా అనుమతులు తీసుకోవాల్సిందే
CP Avinash Mahanthi: న్యూఇయర్ వేడుకలపై తెలంగాణ పోలీసులు ఆంక్షలు విధించారు. సన్‌బర్న్ ఈవెంట్‌కు అనుమతి లేదని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. సన్‌బర్న్ మ్యూజిక్ ఫెస్టివల్‌కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదన్న సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి.. సన్‌బర్న్ ఈవెంట్‌కు అనుమతి కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదన్నారు. అనుమతి లేకుండా టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బుక్‌మై షో ప్రతినిధులను పిలిచి హెచ్చరించామన్నారు. ఇక.. న్యూఇయర్ ఈవెంట్లకు ఎవరైనా అనుమతులు తీసుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు సైబరాబాద్ సీపీ మహంతి.