Hyderabad: ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయండి..ఆఫీసులకు వెళ్లొద్దు..ట్రాఫిక్ పోలీసుల సూచనలు ఇవే

Hyderabad Rains : భారీ వర్షంతో హైదరాబాద్ నగరం తడిసిముద్దయ్యింది. ఎక్కడ చూసిన వరద నీరే కనిపిస్తోంది. ఎన్నో కాలనీలు వరద ముంపులో చిక్కుకున్నాయి. కాలు తీసి బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-09-02 03:36 GMT

 Hyderabad: ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయండి..ఆఫీసులకు వెళ్లొద్దు..ట్రాఫిక్ పోలీసుల సూచనలు ఇవే

Hyderabad Rains : హైదరాబాద్ నగరంలో పనిచేసే ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలుచేశారు. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం కు అనుమతి ఇవ్వాలని ఐటీ కంపెనీలకు సైబరాబాద్ ట్రాఫీక్ పోలీసులు సూచించారు. హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతి ఇవ్వాలని కంపెనీలకు లేఖరాశారు. ఐటీ ఉద్యోగులు సోమవారం ఇంటి నుంచే పనిచేయాలని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయోల్ డేవిస్ సూచించారు.

భారీ వర్షం కారణంగా నగరంలో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఐటీ ఉద్యోగులు, ఆఫీసులకు వెళ్లడానికి కార్లను వినియోగిస్తుంటారు. కాబట్టి ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారుతుందని పోలీసులు భావిస్తున్నారు. అందుకే ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం ఇస్తే ట్రాఫిక్ తగ్గుతుందని..సహాయక చర్యలు తొందరగా చేపట్టేందుకు వీలు కలుగుతుందని భావిస్తున్నారు పోలీసులు.



ఇక నగరంలో ఆదివారం కుండపోత వర్షం కురిసింది. ఉప్పల్, ఎల్బీనగర్, హయత్ నగర్ , దిల్ షుక్ నగర్, మలక్ పేట ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసింది. దీంతో అనేక వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. గండిపేట, హయత్ నగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఎగువ నుంచి జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. భారీ వర్షాలకు వాగులు, వంకలుకూడా పొంగిపొర్లుతున్నాయి. జంట జలాశయాలను వాటర్ వర్క్స్ అధికారులు ఇప్పటికే పరిశీలించారు.

చిన్న వర్షానికే నగరంలోని నాలాల నుంచి వచ్చే నీరు రహదారులపై చేరి పరిస్థితి దారుణంగా తయారవుతుంది. అలాంటిది గత 48గంటల్లో హైదరాబాద్ తోపాటు శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఈ పరిస్థితుల్లో టూవీలర్స్, ఫోర్ వీలర్స్ పై ఆఫీసులకు వెళ్లేవారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వర్క్ ఫ్రం హోం ఛాన్స్ ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.

Tags:    

Similar News