Coronavirus: లక్షణాలు ఉంటే వెంటనే మెడిసిన్ కిట్ అందించాలి- సీఎస్
Coronavirus: తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ బొగ్గులకుంట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను తనిఖీ చేశారు.
Coronavirus: తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ బొగ్గులకుంట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను తనిఖీ చేశారు. కొవిడ్ అవుట్ పేషెంట్ సర్వీసుల నిర్వహణలను పరిశీలించారు. కొవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, సబ్ సెంటర్లలో కోవిడ్ ఓపి సర్వీసులను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా సీఎస్ సోమేష్ కుమార్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను సందర్శించి ఓపీ నిర్వహణకు చేసిన ఏర్పాట్లను తెలుసుకున్నారు. లక్షణాలు ఉన్నవారికి రిపోర్టు కోసం ఆగకుండా వెంటనే మెడిసిన్ కిట్‌ను అందించి చికిత్సను ప్రారంభించాలన్నారు. స్వల్ప జ్వర లక్షణాలు ఉన్నవారు వెంటనే సమీపంలోని ఆసుపత్రులలో ఓపి చికిత్సకు హాజరై, ఉచితంగా అందజేసే మందులను వాడాలని సూచించారు.