హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. సీఎస్ కీలక సమీక్ష

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సహా పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని హైడ్రా, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీచేసింది.

Update: 2024-08-29 07:38 GMT

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. సీఎస్ కీలక సమీక్ష

Hydra: సీఎస్ శాంతి కుమారి కీలక సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, హైడ్రా, హెచ్‌ఎండీఏ, రెవెన్యూశాఖ, నీటిపారుదల, వీఅండ్‌వీ, ఏసీబీ, పోలీస్ తదితరశాఖల అధికారులతో రివ్యూ చేపట్టారు. చట్టవిరుద్దమైన నిర్మాణాల కూల్చివేత ప్రక్రియను..ప్రారంభించే అంశంలో హైకోర్టు సూచలపై చర్చిస్తున్నారు. రివ్యూకు హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లు హాజరయ్యారు.

తాజాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సహా పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని హైడ్రా, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో క్రమంలోనే ఇవాళ సీఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

Tags:    

Similar News